యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌(prabhas) నటించే ప్రతీ సినిమా ఇప్పుడు పాన్‌ ఇండియా మూవీనే! బాహుబలి సినిమాతో ఆయన రేంజ్‌ అమాంతం పెరిగింది. ఓవర్‌నైట్‌ పాన్‌ ఇండియా స్టారయ్యారు. బాహుబలి తర్వాత వచ్చిన సినిమాలు అంతగా విజయవంతం కాకపోయినా ప్రభాస్‌ పాపులారిటీ ఏ మాత్రం తగ్గలేదు. ఆదిపురుష్‌(Adhipurush) తర్వాత రాబోతున్న సినిమా సలార్‌(salaar).

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌(prabhas) నటించే ప్రతీ సినిమా ఇప్పుడు పాన్‌ ఇండియా మూవీనే! బాహుబలి సినిమాతో ఆయన రేంజ్‌ అమాంతం పెరిగింది. ఓవర్‌నైట్‌ పాన్‌ ఇండియా స్టారయ్యారు. బాహుబలి తర్వాత వచ్చిన సినిమాలు అంతగా విజయవంతం కాకపోయినా ప్రభాస్‌ పాపులారిటీ ఏ మాత్రం తగ్గలేదు. ఆదిపురుష్‌(Adhipurush) తర్వాత రాబోతున్న సినిమా సలార్‌(salaar). ప్రశాంత్‌నీల్‌(Prashanth Neil) దర్శకత్వంలో వస్తున్న ఈ భారీ యాక్షన్‌ సినిమాను హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో ప్రభాస్‌ సరసన శ్రుతిహాసన్‌(Shruthi Hassan) నటిస్తోంది. జగపతిబాబు(Jagapathi Babu), మలయాళ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.

సెప్టెంబర్‌ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ నేపథ్యంలో ప్రమోషన్‌ పనులను స్పీడప్‌ చేశారు మేకర్స్‌. ఇందులో భాగంగా ఈ చిత్ర గ్లింప్స్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జూన్‌ 16న రిలీజవుతున్న ఆదిపురుష్‌ సినిమాతో పాటే సలార్‌ ప్రచార చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. సలార్‌లో విలన్‌ పాత్రను సౌరవ్‌ లోకేష్‌(Sourav Lokesh) పోషిస్తున్నారు. విశాల్‌ నటించిన పొగరు సినిమాలో వాప్‌ రోల్‌లో నటించిన శ్రియా రెడ్డి(shriya Reddy) ఈ సినిమాలో పవర్‌ఫుల్‌ రోల్‌ను పోషిస్తున్నారు. ఈ సినిమాకు రవి బస్రూర్‌ సంగీతం అందిస్తున్నారు.

Updated On 27 May 2023 1:37 AM GMT
Ehatv

Ehatv

Next Story