ప్రభాస్‌(Prabhas) అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సలార్‌ మూవీ టీజర్‌(Salaar Teaser) వచ్చేసింది. సోషల్ మీడియా(Social Media)ను ఆ టీజర్‌ దున్నేస్తోంది. ఫ్యాన్స్‌ అంతా ఫుల్‌ ఖుషీతో ఉన్నారు. ఇదే సమయంలో డార్లింగ్‌ అభిమానులకు ప్రాజెక్ట్ కే(Project K) మేకర్స్‌ కూడా బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చి డబుల్‌ ధమాకా ఇచ్చారు. నాగ్‌ అశ్విన్‌(Nag Ashwin) దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న సోషియా ఫాంటసీ సినిమా ప్రాజెక్ట్‌ కే.

ప్రభాస్‌(Prabhas) అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సలార్‌ మూవీ టీజర్‌(Salaar Teaser) వచ్చేసింది. సోషల్ మీడియా(Social Media)ను ఆ టీజర్‌ దున్నేస్తోంది. ఫ్యాన్స్‌ అంతా ఫుల్‌ ఖుషీతో ఉన్నారు. ఇదే సమయంలో డార్లింగ్‌ అభిమానులకు ప్రాజెక్ట్ కే(Project K) మేకర్స్‌ కూడా బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చి డబుల్‌ ధమాకా ఇచ్చారు. నాగ్‌ అశ్విన్‌(Nag Ashwin) దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న సోషియా ఫాంటసీ సినిమా ప్రాజెక్ట్‌ కే. ఇందులో బాలీవుడ్‌ నటి దీపికా పదుకొనే(Deepika Padukone) హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌బచ్చన్‌(Amitabh Bachchan), లోకనాయకుడు కమలహాసన్‌(Kamalahasan)లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ప్రాజెక్ట్‌ కె పోస్టర్స్‌ అదిరిపోయే విధంగా ఉన్నాయి. సినిమాకు సంబంధించి టైటిల్‌ ప్రకటనతో పాటు గ్లింప్స్‌ను కూడా ఈ నెల 20వ తేదీన విడుదల చేయనున్నారన్న ప్రచారం జరుగుతున్న తరుణంలో చిత్ర యూనిట్‌ ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అమెరికా(America)లో జరిగే శాన్‌ డియాగో కామిక్‌-కాన్‌(San Diego Comic-Con) (ఎస్‌డీసీసీ) వేడుకలో ప్రాజెక్ట్‌ కె ఫస్ట్ గ్లింప్స్‌తో పాటు టైటిల్‌ను కూడా ప్రకటిస్తారు. అంతే కాదు విడుదల తేదీని కూడా ఆ వేదికపైనే ప్రకటించనున్నారు. అమెరికాలో జులై 19 నుంచి కామిక్‌-కాన్‌ వేడుకలు ప్రారంభం కాబోతున్నాయి. కాగా, జులై 20వ తేదీన ప్రభాస్‌, కమలహాసన్‌, అమితాబ్‌బచ్చన్‌, దీపికా పదుకొనే, నాగ్‌ అశ్విన్‌ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొననున్నరు. తదనంతరం సినిమాకు సంబంధించిన టైటిల్‌ను ఆ వేదిక మీద రివీల్‌ చేస్తారు. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాకు ఇలాంటి గౌరవం దక్కలేదు. ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్‌ ఫ్యాన్స్‌ తెగ సంబరపడుతున్నారు. టాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ వరకు మా డార్లింగ్‌ క్రేజ్‌ వ్యాపించిందంటూ ఆనందపడుతున్నారు.

Updated On 7 July 2023 4:40 AM GMT
Ehatv

Ehatv

Next Story