సెలబ్రిటీలు సోషల్ మీడియా(Social Media)లో ఏ పోస్టు పెట్టినా క్యూరియాసిటీగానే ఉంటుంది. డార్లింగ్ ప్రభాస్(Hero Prabhas) వంటి మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్లు పెడితే మరింత ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. పొద్దునే ఆ పాన్ ఇండియా స్టార్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
సెలబ్రిటీలు సోషల్ మీడియా(Social Media)లో ఏ పోస్టు పెట్టినా క్యూరియాసిటీగానే ఉంటుంది. డార్లింగ్ ప్రభాస్(Hero Prabhas) వంటి మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్లు పెడితే మరింత ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. పొద్దునే ఆ పాన్ ఇండియా స్టార్ ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. Darlings!!... Finally someone very special is about to enter our life.. Wait cheyandi... అంటూ ఓ పోస్ట్ పెట్టాడు ప్రభాస్.. తెలుగులో చెప్పాలంటే డార్లింగ్స్ చివరగా చాలా ప్రత్యేకమైన వ్యక్తి మన జీవితంలో ప్రవేశించబోతున్నారు. వెయిట్ చేయండి అంటూ రాసిన ఆ క్యాప్షన్ అభిమానులకు, సినిమా ప్రేమికులకు క్యూరియాసిటీని తెచ్చింది. ఏమిటా పోస్ట్‌కు అర్థం? తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఏదైనా శుభవార్త చెప్పబోతున్నాడా? ఒకవేళ నిజంగానే గుడ్ న్యూస్ అయితే నా జీవితంలో అనేవాడు తప్ప మన జీవితంలో అని ఎందుకంటాడు? నెటిజన్లు పొద్దున్నుంచి ఒకటే బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు. అయితే ఈ పోస్ట్ అతడి పర్సనల్ లైఫ్‌కు సబంధించింది కాదని, కల్కి 2898 ఏడీ సినిమా(Kalki 2898 AD)కు సంబంధించిన అప్‌డేట్ అని కొందరు అంటున్నారు. మూవీ మేకర్స్ అతి త్వరలోనే ఫస్ట్ సింగిల్‌ను లాంచ్ చేయబోతున్నారని, ఆ విషయంపైనే ప్రభాస్ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టాడని చెబుతున్నారు. ఈ పోస్ట్‌కు సంబంధించిన సస్పెన్స్ ఎప్పుడు వీడుతుందో కానీ, కల్కి 2898 ఏడీ సినిమాపై మాత్రం ప్రేక్షకులు అమితాసక్తిగా ఉన్నారు. సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో రూపొందుతున్న ఈ సినిమాను వైజయంతీ మూవీస్ నిర్మిస్తోంది. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్(Nag Ashwin) దర్శకత్వం వహిస్తున్నాడు. దీపికా పడుకొనే(Deepika Padukone), దిశా పటానీ(Disha Patani) ప్రధాన పాత్రల్లో నటిస్తుంటే , అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan), కమలహాసన్(Kamal Hassan), రాజేంద్రప్రసాద్(Rajendra Prasad), పశుపతి(Pasupathy) వంటి మేటి నటులు ముఖ్య పాత్రలలో కనిపిస్తారు. ఇప్పటికే కల్కి 2898 ఏడీ టైటిల్, గ్లింప్స్ వీడియో, టీజర్ విడుదలయ్యాయి. మిలియన్ల సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి. జూన్ 27వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.