రెబల్‌స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. సలార్ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 28న సలార్‌ను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. బాహుబలి-2 తర్వాత ప్రభాస్ నటించిన ఏ సినిమా ఫ్యాన్స్‌ను మెప్పించలేకపోయింది. సాహో, రాధేశ్యామ్ సినిమాలో విజయం సాధించలేకపోయాయి. అయితే ప్రభాస్ వరుస సినిమాల్లో నటిస్తుండటంతో అభిమానులకు ఊరట కలిగించే అంశం. ప్రస్తుతం సెట్స్ మీద నాలుగు సినిమాలు ఉన్నాయి. మరో రెండు సినిమాలు లైన్‌లో ఉన్నాయి.
1.రెబల్‌స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. సలార్ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 28న సలార్‌ను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. బాహుబలి-2 తర్వాత ప్రభాస్ నటించిన ఏ సినిమా ఫ్యాన్స్‌ను మెప్పించలేకపోయింది. సాహో, రాధేశ్యామ్ సినిమాలో విజయం సాధించలేకపోయాయి. అయితే ప్రభాస్ వరుస సినిమాల్లో నటిస్తుండటంతో అభిమానులకు ఊరట కలిగించే అంశం. ప్రస్తుతం సెట్స్ మీద నాలుగు సినిమాలు ఉన్నాయి. మరో రెండు సినిమాలు లైన్‌లో ఉన్నాయి. ఆ మాటకొస్తే ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలు మరే పాన్ ఇండియా స్టార్ దగ్గర లేవన్నది నిజం. రాధేశ్యామ్ తర్వాత ఓకేసారి నాలుగు సినిమాలు లైన్లో పెట్టాడు ప్రభాస్. ఆదిపురుష్ సినిమాతో ప్రభాస్ బాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ మూవీ జూన్ 16న రిలీజ్ కాబోతున్నది. ఇప్పటికే ఈ మూవీ హండ్రెడ్ డేస్ కౌంట్‌డౌన్ కూడా మొదలయ్యింది. కేజీఎఫ్ సిరీస్ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న సలార్ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది.
2.మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ బయోపిక్‌లో నటించాలని ఉందన్న కోరికను వెలిబుచ్చారు. ట్రిపులార్ మూవీతో గ్లోబల్ స్టార్‌గా మారిపోయిన చరణ్‌కు స్పోర్ట్స్ బయోపిక్‌లో నటించాలని ఉందన్నారు. అవకాశం వస్తే టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బయోపిక్‌లో నటించాలని ఉందంటూ తన మనసులోని మాట బయటపెట్టారు. వర్తమాన క్రికెట్‌లో విరాట్ కోహ్లీకి మించిన క్రికెటర్ లేడన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. ఈ మాటే రామ్‌చరణ్ చెబుతూ ఆయనది స్ఫూర్తిదాయకమైన క్యారక్టర్ అని ప్రశంసించారు. కోహ్లీ పాత్ర ధరించే ఛాన్స్ వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోనని చెర్రీ అన్నారు. అదీ కాకుండా కోహ్లీకి తనకు దగ్గర పోలికలు ఉంటాయని, ఇది కూడా తనకు అదనపు అడ్వాంటేజ్ అవుతుందని చరణ్ పేర్కొన్నారు. మొదట్నుంచి రామ్‌చరణ్ కెరీర్‌ను చక్కగా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు. డిఫరెంట్ పాత్రలను ఎన్నుకుంటున్నారు. నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. విజయం సాధిస్తున్నారు. ప్రజెంట్ స్పోర్ట్స్ బయోపిక్ చేయాలని ఉందన్న కోరికను వెలిబుచ్చటంతో ఫ్యాన్స్ తెగ ఆనందపడుతున్నారు.
3.ప్రపంచపటంలో ట్రిపులార్ నిలబడి ఆస్కార్ అవార్డు గెల్చుకుందంటే అందుకు తాము, తమ బృందం ఎంత కారణమ తెలుగు చిత్ర పరిశ్రమ, భారతీయ చిత్ర పరిశ్రమ కూడా అంతే కారణమని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. విష్వక్‌సేన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఆర్‌ఆర్‌ఆర్ ఇచ్చిన ఉత్సాహంతో తెలుగు సినిమాలు, ఇండియన్ సినిమాలు మరింత ముందుకు వెళ్లాలనని భగవంతుడిని కోరుకుంటున్నానని ఎన్టీఆర్ తెలిపారు.
4.నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన పాన్ ఇండియా మూవీ దసరా విడుదలకు సిద్ధమయ్యింది. కీర్తి సురేశ్, సాయి కుమార్, సముద్రఖని, జరీనా వాహబ్‌లు నటించిన ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమాను రూపొందించారు. అందరినీ కదిలించే భావోద్వేగాలు ఈ సినిమాలో ఉన్నాయని చిత్రవర్గాలు తెలిపాయి. ఈ నెల 30 విడుదలవుతున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించారు.
5.కామెడీ హీరో ముద్రను తొలగించుకోవడం కోసం అల్లరి నరేశ్ ఎంతో తాపత్రయపడుతున్నారు. ఇటీవలి కాలంలో డిఫరెంట్ రోల్స్‌ను ఎంచుకుంటున్నాడు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఉగ్రం సినిమా కూడా అల్లరి నరేశ్‌కు మంచి పేరు తెచ్చేట్టుగా ఉందంటున్నారు. మిర్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. రేపు అంటే 19న దేవేరి అంటూ సాగే ఓ పాటను రిలీజ్ చేయబోతున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.
6.రంగమార్తండ సినిమాపై దర్శకుడు కృష్ణవంశీ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధానపాత్రలు పోషిస్తున్న ఈ సినిమా మరాఠీ మూవీ నటసామ్రాట్‌కు రీమేక్. రాహుల్ సిప్లిగంజ్, అనసూయ భరద్వాజ్, శివాత్మిక రాజశేఖర్‌లు కూడా ఈ సినిమాలో నటించారు. ఈ నెల 22న విడుదల అవుతున్న ఈ సినిమా కృష్ణవంశీ కెరీర్‌లోనే బెస్ట్ సినిమా కాబోతున్నది. రమ్యకృష్ణ చనిపోయే సీన్‌ను చిత్రీకరించడానికి 36 గంటలు పట్టిందట. అందుకు కారణం సెంటిమెంట్ అడ్డుపడటమేనని కృష్ణవంశీ అన్నారు. గుండె రాయి చేసుకుని షూటింగ్ చేశానని చెమ్మగిల్లిన కళ్లతో కృష్ణవంశీ చెప్పుకొచ్చారు.