ప్రభాస్(Prabhas) డార్లింగ్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్.. నటుడు జీవీ ప్రకాష్(GV Prakash).. గాయని సైంధవి(Saindhavi) తమ వివాహ బంధానికి వీడ్కోలు చెప్పారు. తానూ.. సైంధవి విడిపోయామని జీవీ ప్రకాష్ స్వయంగా ప్రకటించారు. జీవీ ప్రకాష్ ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ మేనల్లుడు. జీవీ ప్రకాష్-సైంధవి 11 ఏళ్ల క్రితం వివాహబంధంతో ఒకటయ్యారు. వారికి నాలుగేళ్ల పాప ఉంది.

ప్రభాస్(Prabhas) డార్లింగ్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్.. నటుడు జీవీ ప్రకాష్(GV Prakash).. గాయని సైంధవి(Saindhavi) తమ వివాహ బంధానికి వీడ్కోలు చెప్పారు. తానూ.. సైంధవి విడిపోయామని జీవీ ప్రకాష్ స్వయంగా ప్రకటించారు. జీవీ ప్రకాష్ ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ మేనల్లుడు. జీవీ ప్రకాష్-సైంధవి 11 ఏళ్ల క్రితం వివాహబంధంతో ఒకటయ్యారు. వారికి నాలుగేళ్ల పాప ఉంది. సినీ ఇండస్ట్రీలో అన్యోన్యమైన జంటగా వీరికి మంచి పేరు ఉంది. అటువంటిది వీరి విడాకుల(divorce) వార్త విని అభిమానులు షాక్ అయ్యారు. “చాలా ఆలోచించి సైంధవి, నేనూ విడిపోవడమే మంచిది అని భావించి విడిపోతున్నాం. మేము 11 సంవత్సరాల వివాహబంధానికి ముగింపు పలికాం. మా మానసిక ఆరోగ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం” అని తమ విడాకులపై జీవీ ప్రకాష్ మీడియాకు క్లారిటీ ఇచ్చారు. ఈ జంట విడాకులు తీసుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఇది ఆయన అభిమానులను కలవరపరిచింది. దీనిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

Updated On 14 May 2024 6:06 AM GMT
Ehatv

Ehatv

Next Story