యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్‌కు ఇది అచ్చమైన సంక్రాంతి. ఎందుకంటే ఆయన నటించిన సలార్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. వరుస ఫ్లాపుల తర్వాత ప్రభాస్‌కు ఊరట నిచ్చిన చిత్రమిది. ఇక ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ మరో సినిమాకు సిద్ధమయ్యారు. క్రేజీ దర్శకుడు మారుతితో నటిస్తున్న సినిమా టైటిల్‌ను రివీల్ కూడా చేశారు.

maruthi prabhas
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas)కు ఇది అచ్చమైన సంక్రాంతి. ఎందుకంటే ఆయన నటించిన సలార్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్(blockbuster Salaar movie) కొట్టింది. వరుస ఫ్లాపుల తర్వాత ప్రభాస్‌కు ఊరట నిచ్చిన చిత్రమిది. ఇక ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ మరో సినిమాకు సిద్ధమయ్యారు. క్రేజీ దర్శకుడు మారుతి(Director Maruti)తో నటిస్తున్న సినిమా టైటిల్‌ను రివీల్ కూడా చేశారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్ర నిర్మాణ సంస్థ ది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory) సినిమా టైటిల్‌ను ప్రకటిస్తూ ట్వీట్ చేసింది. ప్రభాస్- మారుతి(Prabhas- Maruti) కొత్త చిత్రానికి ది రాజాసాబ్(The Rajasaab) అనే టైటిల్‌ను ఖారారు చేశారు. టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. రెబల్ స్టార్ కొత్త లుక్‌లో కనిపించడంతో అభిమానులు సంబరపడుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్(People Media Factory Banner)పై తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగతాన్ని అందిస్తున్నారు.
