ఆదిపురుష్‌(Adipurush) సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాపై మిశ్రమ స్పందన వచ్చింది. రామాయణ(Ramayanam) గాధను ఆధునిక టెక్నాలజీతో తెరకెక్కించిన ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్‌(Prabhas) నటించారు. సీతమ్మగా కృతి సనన్‌(Kritti sanon), రావణబ్రహ్మగా సైఫ్‌ అలీఖాన్‌(Saif ALi Khan) నటించారు.

ఆదిపురుష్‌(Adipurush) సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాపై మిశ్రమ స్పందన వచ్చింది. రామాయణ(Ramayanam) గాధను ఆధునిక టెక్నాలజీతో తెరకెక్కించిన ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్‌(Prabhas) నటించారు. సీతమ్మగా కృతి సనన్‌(Kritti sanon), రావణబ్రహ్మగా సైఫ్‌ అలీఖాన్‌(Saif ALi Khan) నటించారు. ఈ సినిమా బాగుందని కొందరంటుంటే, తమకు అసలు నచ్చలేదని మరికొందరు అంటున్నారు. రామాయణాన్ని పూర్తిగా మార్చి తీశారని విమర్శిస్తున్నారు.

రావణాసురుడి గెటప్‌పై చాలా విమర్శలు వస్తున్నాయి. ఏది ఎలా ఉన్నా ఈ సినిమాలో నటించిన ప్రభాస్‌(prabhas) మాత్రం సరికొత్త రికార్డును సృష్టించారు. ఇప్పుడు ఇదే విషయాన్ని ఇండస్ట్రీలో ముచ్చటించుకుంటున్నారు. బాహుబలి సినిమా తర్వాత డార్లింగ్‌ ప్రభాస్‌కు దేశవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. ప్రభాస్‌ జాతీయ నటుడయ్యారు. ఆ తర్వాత ప్రభాస్‌ సినిమాలు పాన్‌ ఇండియా లెవల్‌లో విడుదలయ్యాయి. పాన్‌ ఇండియా సినిమాలనే ప్రభాస్‌ ఒప్పుకుంటున్నారు. 2019లో వచ్చిన సాహో(saho), 2022లో వచ్చిన రాధేశ్యామ్‌(Radheshyam) ఇలాంటి సినిమాలే. ఇప్పుడు ఆదిపురుష్‌(Adipurush) కూడా అంతే.

రామాయణం ఆధారంగా తీసిన ఈ సినిమా టీజర్‌ విడుదలైనప్పుడు జనం గగ్గోలు పెట్టారు. ఘోరమైన ట్రోల్స్‌ వచ్చాయి. ట్రైలర్‌ చూసిన తర్వాత చాలా మంది సంతృప్తి చెందారు. సినిమాపై ఆసక్తిని పెంచుకున్నారు. ఎప్పుడైతే బిగ్‌ స్క్రీన్‌పై ఆదిపురుష్‌ సినిమా చూశారో అప్పుడే నిరాశ చెందారు. సరే.. ఆదిపురుష్‌ టాక్‌ ఎలా ఉంటే ఏమిటిగానీ మొదటి రోజు కలెక్షన్లు మాత్రం అదిరిపోయయి.

ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్‌ డే దాదాపు 150 కోట్ల రూపాయలను ఈ సినిమా వసూలు చేసింది. గతంలో బాహుబలి, సాహోలు కూడా రిలీజైన మొదటి రోజే వంద కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు చేశాయి. ఇప్పుడు ఆదిపురుష్‌. అంటే మూడు సినిమాలతో ఈ మార్క్‌ను అందుకున్న వన్‌ అండ్‌ ఓన్లీ హీరో ప్రభాస్‌. తొలి రోజు కలెక్షన్ల విషయంలో ప్రభాసే టాప్‌! ఏ హీరో కూడా ప్రభాస్‌ దరిదాపుల్లో లేరు.

Updated On 17 Jun 2023 2:02 AM GMT
Ehatv

Ehatv

Next Story