✕
Prabhas Adipurush : ఆదిపురుష్ సినిమాకు కొత్త చిక్కులు.. నిర్మాతలపై కేసు నమోదు.. !
By EhatvPublished on 5 April 2023 1:15 AM GMT
బాహుబలి (Baahubali)తో డార్లింగ్ ప్రభాస్ (Prabhas) దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆయన పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు. అయితే మన డార్లింగ్ ప్రభాస్ వర్షం (Varsham) సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. మొదటి సినిమాతోనే హిట్ కొట్టాడు. చత్రపతి (Chatrapathi), డార్లింగ్ (Darling), మిస్టర్ ఫర్ఫెక్ట్ (Mr.Perfect), మిర్చి (Mirchi) వంటి సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.

x
Prabhas Adipurush
-
- బాహుబలి (Baahubali)తో డార్లింగ్ ప్రభాస్ (Prabhas) దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆయన పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు. అయితే మన డార్లింగ్ ప్రభాస్ వర్షం (Varsham) సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. మొదటి సినిమాతోనే హిట్ కొట్టాడు. చత్రపతి (Chatrapathi), డార్లింగ్ (Darling), మిస్టర్ ఫర్ఫెక్ట్ (Mr.Perfect), మిర్చి (Mirchi) వంటి సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.
-
- దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (S.S.Rajamouli) తెరకెక్కించిన బాహుబలి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. బాహుబలి 2015 (Baahubali: The Beginning), బాహుబలి-2 (Baahubali2:The Conclusion) 2017లో రిలీజైన ది కంక్లూజన్ సినిమా జాతీయ అవార్డుతోపాటు పలు అవార్డులు గెలుచుకుంది.
-
- 250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన బాహుబలి-2 సినిమా వరల్డ్ వైడ్‌గా రూ. 1810 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రూ. 1000 కోట్ల గ్రాస్ వసూలు చేసిన తొలి సినిమాగా రికార్డు సృష్టించింది. రీసెంట్ టైమ్స్‌లో వన్ ఆఫ్ ది మోస్ట్ సూపర్ స్టార్లలో మన డార్లింగ్ ప్రభాస్ (Prabhas) ఒకరు అని చెప్పాలి.
-
- ఇక ప్రస్తుతం ఈ ఆరగుడుల అందగాడు వరుసగా 5 ప్రాజెక్టులను చేస్తున్నాడు. ఓం రౌత్ (Om Raut)దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కె, అండ్ అలాగే సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ చిత్రంతోపాటు డైరెక్టర్ మారుతితో ఓ ప్రాజెక్టు చేస్తున్నాడు ప్రభాస్.
-
- అయితే ఆదిపురుష్ (Adipurush) సినిమా కొత్త పోస్టర్ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు కొంతమంది. దీంతో ఆ సినిమా నిర్మాతలకు కొత్త చిక్కొచ్చిపడినట్లే అయింది. అది సనాతన ధర్మంగానే తీసుకున్నామని డైరెక్టర్ ఓమ్ రౌత్ (Om Raut) అంటున్నారు. ఇదిలా ఉంటే హిందూ మత సమాజంలోని మత భావాలను దర్శకుడు ఓం రౌత్ దెబ్బతీశారని.. రామచరితమానస్‌కు భంగం కలిగేలా చూపించారంటున్నారు.
-
- రాముడి క్యారెక్టర్ సహజ స్వభావానికి విరుద్ధ దుస్తుల్లో కనిపిస్తున్నాడన్నది హిందూవాదులు వాదన. అయితే పురాణాల ఆధారంగా సనాతన ధర్మానికి ప్రత్యేక మార్క్ ఉందని అటు హిందువాదులతోపాటు ఇటు సామాన్యులు కూడా అంటున్నారు. మొత్తానికి ఆదిపురుష్ (Adipurush) చిత్రం ఒక్క పోస్టర్ కే ఇంత వివాదాన్ని చుట్టుకుందంటే.. సినిమా రిలీజ్‌కు ముందు.. ఆ తర్వాత మరెన్ని వివాదాలను మూటగట్టుకుంటుందో చూడాలి మరి.

Ehatv
Next Story