ప్రభాస్‌(Prabhas) నటించిన భారీ బడ్జెట్ సినిమా కల్కి 2898 ఏడీపై(Kalki 2898 Ad) రివ్యూలు ఎలా ఉన్నప్పటికీ కలెక్షన్లను మాత్రం కుమ్మేస్తోంది.

ప్రభాస్‌(Prabhas) నటించిన భారీ బడ్జెట్ సినిమా కల్కి 2898 ఏడీపై(Kalki 2898 Ad) రివ్యూలు ఎలా ఉన్నప్పటికీ కలెక్షన్లను మాత్రం కుమ్మేస్తోంది. రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్‌ అందుకున్న కల్కి దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళుతోంది. మొదటి రోజు 191.5 కోట్ల రూపాయలు వసూలు చేసి రికార్డు సృష్టించిన కల్కీ వారాంతంలో 555 కోట్ల రూపాయల గ్రాస్‌ కలెక్షన్లను వసూలు చేసింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్‌ ప్రకటించింది. జూన్ 27వ తేదీన విడుదలైన ఈ సినిమా ఇప్పటికే బాక్సాఫీస్‌ దగ్గర పలు రికార్డ్స్‌ను బద్దలు కొట్టింది. ఒక వీకెండ్‌లో అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన తొలి చిత్రంగా 'కల్కి 2898 ఏడీ' నిలిచింది. ఈ దెబ్బతో షారుక్‌ఖాన్‌(Shah rukh khan)- అట్లీ(Atlee) కాంబినేషన్‌లో వచ్చిన జవాన్‌(Jawan) రికార్డుబ్రేక్‌ అయ్యింది.

అంతే కాదు, ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు అత్యధిక కలెక్షన్స్‌ సాధించిన ఇండియన్‌ టాప్‌-3 చిత్రాల జాబితాలో కల్కి మూడో స్థానంలో ఉంది. ఆర్‌ఆర్‌ఆర్‌(RRR) 223 కోట్ల రూపాయలు వసూలు చేస్తే, బాహుబలి సెకండ్‌ పార్ట్‌ 217 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఇక కల్కి 191.5కోట్లు కలెక్ట్‌ చేసింది. ఇందులో రెండు ప్రభాస్‌ సినిమాలే ఉండటం విశేషం. ఉత్తర భారతంలోనూ కల్కి దున్నేస్తోంది. సోమవారం రోజున తెలుగు కంటే హిందిలోనే ఎక్కువ కలెక్షన్స్‌ కల్కికి వచ్చాయి.

Eha Tv

Eha Tv

Next Story