డార్లింగ్ ప్రభాస్(Prabhas), నాగ్ అశ్విన్(Nag Ashwin) కాంబినేషన్‌లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా కల్కి:2898 ఏడీ సినిమా కోసం రెబల్‌స్టార్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, సినిమా అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమాగా వస్తున్న ఇందులో బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan), లోకనాయకుడు కమలహాసన్(Kamal Haasan), దీపికా పడుకొనే(Deepika Padukone), దిశాపటానీ(disha Patani), రాజేంద్రప్రసాద్(rajendra prasad), పశుపతి ప్రధానపాత్రలు పోషిస్తున్నారు.

Kalki 2989 Premier
డార్లింగ్ ప్రభాస్(Prabhas), నాగ్ అశ్విన్(Nag Ashwin) కాంబినేషన్‌లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా కల్కి:2898 ఏడీ సినిమా కోసం రెబల్‌స్టార్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, సినిమా అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమాగా వస్తున్న ఇందులో బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan), లోకనాయకుడు కమలహాసన్(Kamal Haasan), దీపికా పడుకొనే(Deepika Padukone), దిశాపటానీ(disha Patani), రాజేంద్రప్రసాద్(rajendra prasad), పశుపతి ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 27వ తేదీన విడుదల కానుంది. రీసెంట్‌గా రిలీజ్ అయిన ట్రైలర్ అయితే అద్భుతంగా ఉందని క్రిటిక్స్ చెబుతున్నారు. ఫ్యాన్స్ అయితే అంచనాలకు మించి ఉందని మురిసిపోతున్నారు. ఇది ఇలా ఉంటే కల్కి:2898 ఏడీ సినిమాకు అరుదైన గౌరవం లభించింది. లండన్‌లో(London) ఉన్న బ్రిటీష్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ (BFI) ఐమ్యాక్స్‌లో ఈ సినిమా తెలుగు వెర్షన్ ప్రీమియర్t(Telugu Premier) కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 27వ తేదన విడుదల కానుంటే, ఇక్కడ మాత్రం ఒక రోజు ముందుగానే జూన్ 26వ తేదీనే మొదటి ఆట పడనుంది. బ్రిటన్ కాలమాన ప్రకారం రాత్రి 8.30 గంటలకు మొదటి ప్రీమియర్ స్టార్ట్ కానుంది. అక్కడ ఒక సినిమా ప్రీమియర్ షో పడటం అన్నది చాలా అరుదు. గతంలో ఆర్ఆర్ఆర్ సినిమాను కూడా ఇక్కడ ప్రదర్శించారు. ఇప్పుడు కల్కి చిత్రం కూడా ఈ ఘనతను సాధించింది.
