హృతిక్‌ రోషన్‌(Hrithik Roshan)తో మన ఎన్టీఆర్‌(Jr. NTR) స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్నాడన్న విషయం తెలిసిందే కదా! ట్రిపులార్‌ మూవీ(RRR Movie)తో ఇంటర్నేషనల్‌ స్టార్‌గా మారిపోయిన ఎన్టీఆర్‌కు బోల్డంత ఫాలోయింగ్‌ వచ్చేసింది. నార్త్‌ ఇండియా(North India)లో క్రేజ్‌ పెరిగింది. ఇప్పుడు బాలీవుడ్‌ మూవీ(Bollywood Movie) వార్‌-2(War-2)లో ఎన్టీఆర్‌ రోలేమిటి? యంగ్‌ టైగర్‌ విలన్‌గా చేయబోతున్నారా? అన్న చర్చ మొదలయ్యింది. ఎన్టీఆర్‌ ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేయగలడు. జై లవకుశ(Jai Lavakusha) సినిమాలో నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రను వేశాడు.

హృతిక్‌ రోషన్‌(Hrithik Roshan)తో మన ఎన్టీఆర్‌(Jr. NTR) స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్నాడన్న విషయం తెలిసిందే కదా! ట్రిపులార్‌ మూవీ(RRR Movie)తో ఇంటర్నేషనల్‌ స్టార్‌గా మారిపోయిన ఎన్టీఆర్‌కు బోల్డంత ఫాలోయింగ్‌ వచ్చేసింది. నార్త్‌ ఇండియా(North India)లో క్రేజ్‌ పెరిగింది. ఇప్పుడు బాలీవుడ్‌ మూవీ(Bollywood Movie) వార్‌-2(War-2)లో ఎన్టీఆర్‌ రోలేమిటి? యంగ్‌ టైగర్‌ విలన్‌గా చేయబోతున్నారా? అన్న చర్చ మొదలయ్యింది. ఎన్టీఆర్‌ ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేయగలడు. జై లవకుశ(Jai Lavakusha) సినిమాలో నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రను వేశాడు. అద్భుతంగా చేశాడన్న ప్రశంసలను పొందాడు.

ఇప్పుడు స్టార్‌ హరో హృతిక్‌ రోషన్‌తో తలపడే రోల్‌ దొరికింది ఎన్టీఆర్‌కు! హృతిక్‌కు విలన్‌గా ఎన్టీఆర్‌ నటిస్తే బాక్సాఫీసు బద్దలు కావాల్సిందే. హృతిక్‌ రోషన్‌ నటిస్తోన్న వార్‌ -2లో ఎన్టీఆర్‌ స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతున్నాడన్న వార్త విని ఆయన అభిమానులు తెగ సంబరపడ్డారు. ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని ఆత్రుతపడుతున్నారు. అయితే వార్‌-2కి విలన్‌గా ఎన్టీఆర్‌ కంటే ముందు ఇద్దరు స్టార్‌ హీరోలను అనుకున్నారట. ముందుగా యంగ్ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌(Prabhas)ను అప్రోచ్‌ అయ్యారట మూవీ మేకర్స్‌. అయితే అప్పటికే ప్రభాస్‌ ఆదిపురుష్‌(Adipurush), ప్రాజెక్ట్‌ కె(Project K)తో పాటు ఇంకొన్ని ప్రాజెక్టులతో బీజీ అయ్యారు. అందుకే ప్రభాస్‌ సినిమాకు నో చెప్పేశారు. పైగా మల్టిస్టారర్‌ సినిమాల్లో నటించాలన్న ఆసక్తి ప్రభాస్‌కు లేదు. సినిమాను రిజెక్ట్‌ చేయడానికి ఇది కూడా ఓ కారణం. ఆ తర్వాత విజయ్‌ దేవరకొండ(Vijay Devarakonda0ను సంప్రదించారట. అదే సమయంలో అతడి లైగర్‌ సినిమా బాక్సాఫీసు దగ్గర తుస్సుమంది. ఇలాంటి టైమ్‌లో విజయ్‌ దేవరకొండను తీసుకుని రిస్క్‌ చేయడమెందుకని మేకర్స్‌ అనుకున్నారు. విజయ్‌ను కాదని ఎన్టీఆర్‌ దగ్గరకు వెళ్లారు. కథ విన్న ఎన్టీఆర్‌ వెంటనే తలూపారు. అన్నట్టు ఈ సినిమాతో ఎన్టీఆర్‌ రెమ్యూనిరేషన్‌(NTR Remunaration) కూడా భారీగా పెరగబోతున్నది. ట్రిపురాల్ సినిమాకు 45 కోట్ల రూపాయల పారితోషికాన్ని తీసుకున్న ఎన్టీఆర్‌ వార్‌-2 కోసం ఏకంగా వంద కోట్ల రూపాయల రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నారు.

Updated On 11 April 2023 4:01 AM GMT
Ehatv

Ehatv

Next Story