సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan )పెళ్లి గురించి చాలా మంది అడిగి అడిగి విసుగు పుట్టి అడగడం మానేశారు. మన దగ్గర ప్రభాస్‌(Prabhas) అంతే! 40 ఏళ్లు దాటాయి... పెళ్లెప్పుడు అని ప్రభాస్‌ను వేలమంది అడిగే ఉంటారు. పాపం సమాధానం చెప్పలేక ఇబ్బందులు పడ్డారు యంగ్‌ రెబల్‌స్టార్‌. ఇప్పటికీ బ్యాచిలర్‌ లైఫ్‌ను చక్కగా ఎంజాయ్‌ చేస్తున్నాడు. టాలీవుడ్‌ మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ ఎవరైనా ఉన్నారంటే అది ప్రభాసే! యంగ్‌ హీరోలకు పెళ్లి ప్రశ్నల నుంచి తప్పించుకోవడానికి ప్రభాస్‌ ఒక సాకుగా నిలుస్తున్నాడు.

సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan )పెళ్లి గురించి చాలా మంది అడిగి అడిగి విసుగు పుట్టి అడగడం మానేశారు. మన దగ్గర ప్రభాస్‌(Prabhas) అంతే! 40 ఏళ్లు దాటాయి... పెళ్లెప్పుడు అని ప్రభాస్‌ను వేలమంది అడిగే ఉంటారు. పాపం సమాధానం చెప్పలేక ఇబ్బందులు పడ్డారు యంగ్‌ రెబల్‌స్టార్‌. ఇప్పటికీ బ్యాచిలర్‌ లైఫ్‌ను చక్కగా ఎంజాయ్‌ చేస్తున్నాడు. టాలీవుడ్‌ మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ ఎవరైనా ఉన్నారంటే అది ప్రభాసే! యంగ్‌ హీరోలకు పెళ్లి ప్రశ్నల నుంచి తప్పించుకోవడానికి ప్రభాస్‌ ఒక సాకుగా నిలుస్తున్నాడు. మొన్నటికి మొన్న అన్‌స్టాపబుల్‌ షోలో శర్వానంద్‌ను బాలకృష్ణ పెళ్లి గురించి అడిగితే ప్రభాస్‌ చేసుకున్న తర్వాత చేసుకుంటా అని టక్కున సమాధానం ఇచ్చాడు. శర్వానందే కాదు చాలా మంది యంగ్‌ హీరోలు పెళ్లికి సంబంధించిన వరకు ప్రభాస్‌ను ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఇక ఇదే విషయాన్ని ప్రభాస్ అడిగితే.. తాను సల్మాన్‌ ఖాన్‌ పెళ్లి చేసుకున్న తర్వాత చేసుకుంటా అని నవ్వుతూ అన్నాడు. ఇన్నాళ్లకు పెళ్లిపై ప్రభాస్‌ ఓ క్లారిటీ ఇచ్చాడు. ఆదిపురుష్‌ ప్రీ రిలీజ్‌ వేడుకలో పెళ్లి గురించి స్పష్టత ఇచ్చాడు. వేడుకలో ప్రభాస్‌ మాట్లాడుతున్నప్పుడు ఫ్యాన్స్‌ పెళ్లి... పెళ్లి అంటూ కేకలేశారు. దానికి ప్రభాస్‌ స్పందించాడు. పెళ్లా...? పెళ్లంటూ చేసుకుంటే ఇక్కడే ఇదే తిరుపతిలో చేసుకుంటా అని చెప్పాడు. ప్రతీసారి ఇలాగే ప్రభాస్‌ పెళ్లి గురించి సరదాగా చెబుతుంటాడు. ఇంతకు ముందు ప్రభాస్‌- అనుష్క ప్రేమించుకుంటున్నారని, త్వరలో పెళ్లి చేసుకుంటారని వార్తలు వచ్చాయి. వీరి పెళ్లికి రెండు కుటుంబాలు అంగీకారం తెలిపాయన్న ముచ్చట కూడా వినిపించింది. అబ్బే అవన్నీ తప్పుడు కథనాలని, మేమిద్దరం మంచి స్నేహితులమని ప్రభాస్‌, అనుష్కలు చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆదిపురుష్‌ సినిమాలో సీతగా నటిస్తున్న కృతి సనన్‌ ప్రేమలో ప్రభాస్‌ మునిగిపోయారని, ఇద్దరూ రహస్యంగా రిలేషన్‌షిప్‌ కొనసాగిస్తున్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని తెగ వార్తలు వచ్చాయి. సోషల్‌ మీడియా అయితే కోడై కూసింది. అవన్ని తప్పుడు కథనాలని ఎంత చెప్పినా అలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. రీసెంట్‌గా ఓ టీవీ షోలో కృతి మనసులో సౌత్‌ హీరో ఉన్నాడని వరుణ్‌ ధావన్‌ చెప్పడం కృతి మనసులో ఉన్న ప్రభాసేనని ఊహించుకోవడం మొదలుపెట్టారు ఫ్యాన్స్‌.

Updated On 7 Jun 2023 3:57 AM GMT
Ehatv

Ehatv

Next Story