ప్రభాస్‌(prabhas) రాముడిగా నటించిన ఆదిపురుష్‌(adipurush) సినిమా విడుదలైన రోజు నుంచే విమర్శలను ఎదుర్కొంటోంది. ఆ సినిమాపై వివాదాలు కూడా చుట్టుముడుతున్నాయి. సినిమాలోని సంభాషణలపై ఎన్నో విమర్శలు. అలాగే వేషధారణ కూడా బాగోలేదని ప్రేక్షకులు అంటున్నారు. రామాయణం(ramayanam) ఆధారంగా ఓం రౌత్‌(Om raut) తెరకెక్కించిన ఈ సినిమాలో సీతగా కృతి సనన్‌(Kriti sanon), రావణాసురుడిగా సైఫ్‌ అలీఖాన్‌(saif Alikhan) నటించారు.

ప్రభాస్‌(prabhas) రాముడిగా నటించిన ఆదిపురుష్‌(adipurush) సినిమా విడుదలైన రోజు నుంచే విమర్శలను ఎదుర్కొంటోంది. ఆ సినిమాపై వివాదాలు కూడా చుట్టుముడుతున్నాయి. సినిమాలోని సంభాషణలపై ఎన్నో విమర్శలు. అలాగే వేషధారణ కూడా బాగోలేదని ప్రేక్షకులు అంటున్నారు. రామాయణం(ramayanam) ఆధారంగా ఓం రౌత్‌(Om raut) తెరకెక్కించిన ఈ సినిమాలో సీతగా కృతి సనన్‌(Kriti sanon), రావణాసురుడిగా సైఫ్‌ అలీఖాన్‌(saif Alikhan) నటించారు. సినిమాపై ఎలాంటి స్పందన వస్తున్నప్పటికీ కలెక్షన్లు మాత్రం బాగానే వచ్చాయి. ఇప్పటికే 400 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది ఆదిపురుష్‌. ఇక మరో విశేషమేమిటంటే ప్రభాస్‌ ప్యాన్స్‌ ఈ సినిమాను సముద్రాలు దాటి మరీ చూస్తున్నారు. తన అభిమాన నటుడు ప్రభాస్‌ నటించిన ఆదిపురుష్‌ సినిమాను చూసేందుకు జపాన్‌కు(japan) చెందిన ఓ మహిళ వేల కిలోమీటర్లు ప్రయాణించారు. జపాన్‌లో ఆదిపురుష్‌ విడుదల కాకపోవడంతో ఆ దేశ రాజధాని టోక్యో(Tokyo) నుంచి సింగపూర్‌(singapore) చేరుకుని, ఆ చిత్రాన్ని వీక్షించారు. తర్వాత తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన పేరు నొడికో(Nodiko) అని, ప్రభాస్‌ అంటే ఎంతో ఇష్టమని ఆమె తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. . సినిమాకి, అభిమానానికి సరిహద్దులు ఉండవంటూ ప్రభాస్‌ అభిమానులు, సినీ ప్రియులు కామెంట్లు పెడుతున్నారు.

Updated On 24 Jun 2023 12:45 AM GMT
Ehatv

Ehatv

Next Story