డార్లింగ్‌ ప్రభాస్‌(Prabhas)కు సలార్‌ సినిమా(Salaar Movie) సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. వరుస పరాజయాలతో ఉన్న ప్రభాస్‌ సలార్‌ ఘన విజయం సాధించడంతో ఊపిరి పీల్చుకున్నాడు. లాస్టియర్‌ డిసెంబర్‌లో విడుదలైన ఈ సినిమా రికార్డు కలెక్షన్లను వసూలు చేసింది. ఓటీటీలో కూడా స్ట్రీమింగ్‌ అవుతోంది. ఓటీటీలో కూడా ఈ సినిమా ట్రెండింగ్‌లో ఉంది.

డార్లింగ్‌ ప్రభాస్‌(Prabhas)కు సలార్‌ సినిమా(Salaar Movie) సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. వరుస పరాజయాలతో ఉన్న ప్రభాస్‌ సలార్‌ ఘన విజయం సాధించడంతో ఊపిరి పీల్చుకున్నాడు. లాస్టియర్‌ డిసెంబర్‌లో విడుదలైన ఈ సినిమా రికార్డు కలెక్షన్లను వసూలు చేసింది. ఓటీటీలో కూడా స్ట్రీమింగ్‌ అవుతోంది. ఓటీటీలో కూడా ఈ సినిమా ట్రెండింగ్‌లో ఉంది. సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది. థియేటర్‌లలో సలార్‌ సినిమా చూస్తున్నప్పుడు గమనించని చాలా సంగతులు ఓటీటీలో చూసిన తర్వాత తెలిసివస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రభాస్‌ సెట్ చేసిన ఓ అరుదైన రికార్డు ఇప్పుడు వైరల్‌ అవుతోంది. బాహుబలి సినిమాల తర్వాత ప్రభాస్‌ రేంజ్‌ ఎక్కడికో వెళ్లిపోయింది. ఓవర్‌నైట్‌ నేషనల్ స్టారయ్యాడు. దేశమంతటా ప్రభాస్‌కు అభిమానులు ఏర్పడ్డారు. ప్రభాస్‌పై పెంచుకున్న విపరీతమైన అభిమానంతో ఆయన నుంచి ఎంతో ఆశించారు. సాహో సినిమా ఫర్వాలేదనిపించినా, తర్వాత వచ్చిన రాధేశ్యామ్‌ అభిమానులను పూర్తిగా నిరాశపర్చింది. సినిమా పోవడంతో ఆదిపురుష్‌ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అది కూడా డిజాస్టర్‌ కావడంతో సలార్‌పై నమ్మకం పెంచుకున్నారు. వారి నమ్మకం ఫలించింది. డిసెంబర్‌ 22వ తేదీన విడుదలైన ఈ సినిమా 700 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. లెటెస్ట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో కూడా దుమ్ము రేపుతోంది. సలార్‌లో ప్రభాస్‌ యాక్షన్‌ అదిరిపోయింది. ఫైట్స్‌ కూడా అద్భుతంగా ఉన్నాయి. సినిమా మొత్త కలిపి ప్రభాస్‌ కేవలం రెండు నిమిషాల 35 సెకన్లు మాత్రమే డైలాగ్స్‌ చెప్పాడు. ఈ సినిమాలో నటించినందుకు ప్రభాస్‌ 125 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నాడని చెబుతున్నారు. ఈ లెక్కన ప్రభాస్‌ సెకనుకు 80 లక్షల 64 వేల 516 రూపాయలు సంపాదించాడన్నమాట! అంటే నిమిషానికి పదుల కోట్ల రూపాయలు. నిమిషానికి కోట్ల రూపాయలు సంపాదించిన నటుడు ప్రస్తుతానికి ప్రభాస్‌ ఒక్కడే!

Updated On 31 Jan 2024 1:19 AM GMT
Ehatv

Ehatv

Next Story