✕
Prabhas as Shiva for 'Kannappa' : శివుడి వేషధారణలో ప్రభాస్ ఎంత అందంగా ఉన్నాడో కదూ!
By EhatvPublished on 5 Oct 2023 12:16 AM GMT
భక్త కన్నప్ప(Bhakta Kannappa) కథతో రూపొందుతున్న ఈ సినిమాకు ముఖేశ్ కుమార్‌సింగ్(Mukesh Kumar Singh) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మధ్యనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది. దాదాపు వంద కోట్ల రూపాయలతో అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

x
Prabhas as Shiva for ‘Kannappa’
-
- మంచు విష్ణు(Manchu Vishnu) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కన్నప్ప సినిమా(Bhakta Kannappa)పై అప్పుడే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు కారణం ఆ సినిమాలో నటిస్తున్న తారాగణం. మంచు ఫ్యామిలీకి ఇది డ్రీమ్ ప్రాజెక్ట్ కావడం కూడా ఓ కారణం. ఇందులో పరమశివుడి పాత్రను ప్రభాస్(Prabhas) చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇందులో నిజముందనే అనిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ విషయాన్ని ప్రభాస్ ఖండించలేదు. త్వరలో అధికారికంగా ప్రకటన కూడా రావచ్చు.
-
- భక్త కన్నప్ప(Bhakta Kannappa) కథతో రూపొందుతున్న ఈ సినిమాకు ముఖేశ్ కుమార్‌సింగ్(Mukesh Kumar Singh) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మధ్యనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది. దాదాపు వంద కోట్ల రూపాయలతో అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎక్కువ భాగం షూటింగ్ న్యూజిలాండ్(New Zealand)లో జరుగనుంది. ఇప్పటికే ఏడు కంటైనర్ల సెట్ ప్రాపర్టీ న్యూజిలాండ్‌కు వెళ్లాయి కూడా! ఈ సినిమాలో శివుడి పాత్రను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పోషిస్తాడని చిత్రబృందం పరోక్షంగా ఇంతకు ముందే ప్రకటించింది.
-
- సినిమాలో కన్నప్ప పాత్ర మినహా మిగిలిన ప్రధాన పాత్రలు చాలా తక్కువ. అందులో కన్నప్ప భక్తిని ఉర్రూతలూగించే శివుడి పాత్ర కూడా ముఖ్యమే. అదే పాత్రలో ప్రభాస్ నటిస్తాడని అంటున్నారు. ఆదిపురుష్(Adipurush) సినిమాలో శ్రీరాముడి పాత్రలో మెప్పించిన ప్రభాస్ కన్నప్పలో శివుడి రూపంలో ప్రభాస్ ఎలా కనిపించబోతున్నాడో ఏఐ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
-
- టెక్నాలజీ సాయంతో శివుడి రూపంలో ప్రభాస్ పోస్టర్లను డిజైన్ చేసి షేర్ చేస్తున్నారు అభిమానులు. శివుడి వేషంలో ప్రభాస్ లుక్ చూసిన వారు అద్భుతంగా ఉన్నాయంటూ వ్యాఖ్యానిస్తున్నారు.కన్నప్పలో శివుడి పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా, పార్వతిగా నయనతార కనిపించనుందని సమాచారం. ఇప్పటికే రెండు సినిమాల్లో పౌరాణిక పాత్రల్లో ఆమె నటించింది. అదే కారణంతో ఆమెను ఎంపిక చేస్తారని సమచారం.

Ehatv
Next Story