ఆమధ్య స్టార్ హీరోల బర్త్ డేలు, ఇతర అకేషన్లు వస్తే చాలు.. కొత్తగా రీ రిలీజ్(Re-Release) ట్రెండ్ ను మొదలెట్టారు. స్టార్ హీరోల లాండ్ మార్క్ మూవీస్ ను తీసుకుని.. రీ రిలీజ్ చేస్తూ.. సందడి చేస్తున్నారు. ఫ్యాన్స్ కు పండగ చేస్తున్నారు. ఇక తాజాగా ప్రభాస్ నటించిన ఛత్రపతి రీరిలీజ్ కు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ గట్టిగా నడుస్తోంది. స్టార్ హీరోల సూపర్ హిట్ మూవీస్ కాని.. కరీర్ లో ఇంపార్టెంట్ అనుకున్నసినిమాను కాని తీసుకుని అకేషన్స్ ప్రకారం రీరిలీజ్ చేయడం ఆనవాయితీగా మారింది. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాన్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, చిరు, బాలయ్య సినిమాలు ఇప్పటికే రీరిలీజ్ ట్రెండ్ లోకి వచ్చాయి ఈ హీరోల సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి.. ఇక ప్రభాస్(Prabhas) కు సబంధించిన కూడా గతంలో రెండు మూడు సినిమాలు రీ రిలీజ్ అవ్వగా.. తాజాగా మరో ప్రభాస్ మూవీ రీరిలీజ్ కు రెడీ అవుతోంది.

ప్రపంచవ్యాప్తంగా రెబల్ స్టార్ ప్రభాస్‏కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. బాహుబలి(Bahubali) సినిమాతో ఒక్కసారిగా డార్లింగ్ క్రేజ్ మారిపోయింది. ఈ మూవీలో ప్రభాస్ నటనకు విమర్శకులే ఫిదా అయ్యారు. కానీ ఆ తర్వాత డార్లింగ్ నటించిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు మాత్రం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో ఇప్పుడు ఫ్యాన్స్ ఆశలన్నీ సలార్(Salaar), కల్కీ(Kalki) చిత్రాలపైనే ఉన్నాయి. ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు

Updated On 20 Oct 2023 7:34 AM GMT
Ehatv

Ehatv

Next Story