వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్న ప్రభాస్(Prabhas).. నెక్ట్స్ సలార్(Salaar) సినిమాతో అలరించడానికి రెడీ అయ్యాడు. కెజియఫ్(KGF) సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth Neel) డైరెక్షన్ లో తెరకెక్కిన పాన్ ఇడియా మూవీ సలార్. రిలీజ్ కు ముస్తాబవుతోంది. వచ్చే నెల అంటే డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ఈసినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు టీమ్.

క్రేజీ కాంబినేషన్ లో మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా నెలకొన్నాయి.. సలార్ ను చూసేందుకు అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈక్రమంలో ప్రభాస్ ఫ్యాన్స్ కు ఓ గుడ్ న్యూస్ అందింది. సలార్ మూవీ టైటిల్ ప్రింట్ తో.. షర్ట్స్(Title Print Shirt) మార్కెట్ లోకి వచ్చాయి.
ఇప్పటికే సలార్ సినిమా ప్రమోషన్స్(Movie Promotions) ను స్టార్ట్ చేసిన టీమ్... స్పీడ్ పెంచారు. కాస్త డిఫరెంట్ గా ప్రమోషన్లను ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్, కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ల సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మూవీ మేకర్స్ సలార్ టీ షర్ట్స్ ను మార్కెట్లోకి రిలీజ్ చేశారు.
ఈ టీషర్ట్స్ రిలీజ్ చేయడం ద్వారా ప్రభాస్ ఫ్యాన్స్ లోకి ఇవి పెద్ద ఎత్తున వెళ్తాయి.. దాంతో పైసా ఖర్చు లేకుండా పబ్లిసిటీ అవ్వడంతో పాటు.. టీషర్ట్ అమ్మకాల వల్ల బిజినెస్ కూడా అవుతుంది. ఈరకంగా పెద్ద ప్లాన్ వేశారు నిర్మాతలు ఇక సినిమా నిర్మించిన హొంబలె ఫిల్మ్స్ వెబ్ సైట్ ద్వారా వీటిని అమ్మకానికి పెట్టారు. ఒక్కో టీ షర్ట్ ధర 499 నుంచి 1,499 వరకు ఉంది. టీషర్ట్ ను బట్టి వివిధ ధరల్లో అవి అందుబాటులో ఉన్నాయి.
అంతా బాగుంది కాని.. ఈ ధరల విషయంలో అభిమానులు గుర్రుగా ఉన్నారు. టీషర్టులు, హుడీలు, హార్మ్ స్లీవ్ లను కూడా అమ్మకానికి పెట్టారు సరే.. ఈ రేట్లేంటి అంటూ... అభిమానులు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. అంతలేసి ధరలు పెడితే సామాన్యులు ఎలా కొంటారని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. టీ షర్ట్ కొంటేనే అభిమానం ఉన్నట్లా.. ఇప్పుడు టీ షర్ట్ కోసం అంత డబ్బు పెట్టలేనని మరో యూజర్ కామెంట్ చేశాడు.