యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌(Prabhas) నటించిన సలార్‌(Salaar) సినిమా వాయిదా ప్రకటన ఫ్యాన్స్‌నే కాదు, సినీ లవర్స్‌ను కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. కేజీఎఫ్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌(Prashanth Neel) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నిజానికి ఈ నెల 28న విడుదల కానుందని చాన్నాళ్లుగా ప్రకటన ఇస్తూ వచ్చారు. సినిమా రెడీ అవుతుందని, చెప్పిన తేదీకే విడుదల చేస్తామని కూడా అన్నారు.

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌(Prabhas) నటించిన సలార్‌(Salaar) సినిమా వాయిదా ప్రకటన ఫ్యాన్స్‌నే కాదు, సినీ లవర్స్‌ను కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. కేజీఎఫ్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌(Prashanth Neel) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నిజానికి ఈ నెల 28న విడుదల కానుందని చాన్నాళ్లుగా ప్రకటన ఇస్తూ వచ్చారు. సినిమా రెడీ అవుతుందని, చెప్పిన తేదీకే విడుదల చేస్తామని కూడా అన్నారు. కానీ అనూహ్యంగా సినిమా వాయిదా(Postpone) అనే వార్తలు రావడంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ నిరుత్సాహానికి గురయ్యారు. బాహుబలి తర్వాత ప్రభాస్‌కు పెద్ద హిట్ పడకపోవడంతో ఫ్యాన్స్‌ అంతా ఈ సినిమాపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు.

ఇప్పుడు విడుదల పోస్ట్‌పోన్‌ కావడంతో హార్ట్‌ బ్రేక్‌ అంటూ ఫ్యాన్స్‌ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఏడాది విడుదలైన ఆదిపురుష్‌(Adipurush) సినిమా భారీ డిజారస్టర్‌గా నిలిచింది. దాంతో పాటు అనేక విమర్శలను కూడా మూటగట్టుకుంది. దీంతో సలార్‌తో ప్రభాస్‌ తన సత్తా చాటుకుంటారని, పాత రికార్డులన్నీ బద్దలవ్వడం ఖాయమని అభిమానులు అనుకున్నారు. సలార్‌ వాయిదా అనే వార్తలు రావడంతో వారు బిత్తరపోయారు. కాకపోతే ఈ విషయంపై మేకర్స్‌ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. బాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ సినీ విశ్లేషకుడు తరుణ్‌ ఆదర్శ్‌(Tharun Adharsh) కూడా సలార్‌ పోస్ట్‌పోన్డ్‌ అంటూ ట్వీట్‌ చేశారు.

అమెరికాలో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మాత్రం సినిమా వాయిదా పడటం ఖాయం అని అనిపిస్తోంది. ప్రభాస్‌- ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌ కావడంతో ఓవర్సీస్‌లో ఊహించని రేంజ్‌లో బుకింగ్స్‌ జరిగాయి. షారుక్‌ ఖాన్‌ సినిమా జవాన్‌కు ఏ మాత్రం తగ్గకుండా అక్కడ టికెట్లు అమ్ముడుపోయాయి. లేటెస్ట్‌గా అమెరికాలో టికెట్ల బుకింగ్‌ వెబ్‌సైట్స్‌ నుంచి సలార్‌ సినిమాను తొలగించారు. మరికొన్నిచోట్ల అయితే ఇప్పటికే టికెట్లు బుక్‌ చేసుకున్న వారికి తిరిగి డబ్బు చెల్లిస్తున్నారు. USA ప్రీమియర్ అడ్వాన్స్ సేల్స్‌లో ఇప్పటికే దాదాపు 19 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి.

సినిమా విడుదలకు 26రోజుల ముందే పది లక్షల డాలర్లను అమెరికాలో కలెక్ట్‌ చేసింది. అమెరికాతో పాటు పలు విదేశాల్లో ఈ సినిమా టికెట్స్‌ హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు అయిదు లక్షలకు పైగా టికెట్స్‌ అమ్ముడయ్యాయని అక్కడి డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ అధికారికంగా తెలిపింది.అమెరికాలో ఉన్న ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే సినిమా వాయిదా పడటం తప్పదేమోనని తెలుస్తోంది. అందుకే ట్రైలర్‌ను కూడా ఇప్పటి వరకు విడుదల చేయలేదని అంటున్నారు. ఇక సినిమా వాయిదా విషయాన్ని సలార్‌ను నిర్మిస్తున్న హోంబలే ఫిల్మ్స్‌ ఈరోజు ప్రకటించే అవకాశం ఉంది.

Updated On 2 Sep 2023 12:22 AM GMT
Ehatv

Ehatv

Next Story