కల్కి సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌

డార్లింగ్‌ ప్రభాస్ (prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌(Nag ashwin) దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 ఏడీ(Kalki 2898 AD) ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈసినిమాలో అమితాబ్‌బచ్చన్‌(Amitab Bachchan), కమలహాసన్‌(Kamal haasan), దీపిక పడుకొనే(Deepika padukone) వంటి స్టార్లు కూడా నటించారు. జూన్‌ 27న థియేటర్లోల విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది. బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు. కల్కి 2898 ఏడీ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌(Amazon prime) వీడియోస్‌ దక్కించుకున్నదట! కల్కి సినిమా ఈ నెల 23వ తేదీ నుంచి అమెజాన్‌ ప్రైవ్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి వుంది. ఇప్పటికే ఈ సినిమా 1300 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది.

Eha Tv

Eha Tv

Next Story