ఆదిపురుష్‌(Adipurush) ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇంకా రెండు రోజుల సమయం ఉంది. ప్రభాస్‌ అభిమానులకు మాత్రం సమయం భారంగా గడుస్తోంది. తొందరగా 16వ తేదీ వచ్చేస్తే బాగుండని అనుకుంఉటన్నారు. ఆదిపురుష్‌ సినిమాపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఆదిపురుష్‌ టికెట్‌ రేట్ల పెంపుకు అనుమతిని ఇచ్చింది. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో టికెట్‌పై 50 రూపాయలు పెంచింది.

ఆదిపురుష్‌(Adipurush) ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇంకా రెండు రోజుల సమయం ఉంది. ప్రభాస్‌ అభిమానులకు మాత్రం సమయం భారంగా గడుస్తోంది. తొందరగా 16వ తేదీ వచ్చేస్తే బాగుండని అనుకుంఉటన్నారు. ఆదిపురుష్‌ సినిమాపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఆదిపురుష్‌ టికెట్‌ రేట్ల పెంపుకు అనుమతిని ఇచ్చింది. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో టికెట్‌పై 50 రూపాయలు పెంచింది. మొదటి మూడు రోజులు మాత్రమే టికెట్‌ పెంపునకు అనుమతినిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులో తెలిపింది. దీంతో పాటు ఆరో ఆటకు కూడా పర్మిషన్‌ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా ఇదే తరహాలో టికెట్‌పై 50 రూపాయలు పెంచుతున్నట్లు పేర్కొంది. సినిమా కోసం డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్‌ ఓనర్లు కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు. దాదాపు రెండు నెలల నుంచి థియెటర్లు ఖాళీగా ఉంటున్నాయి. ప్రేక్షకులు లేక వెలవెలబోయిన థియేటర్లె ఆదిపురుష్‌తో మళ్లీ కళకళలాడబోతున్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. నెల రోజుల క్రితం వరకు ఆదిపురుష్ పై ఎవరూ పెద్దగా ఇంట్రెస్ట్‌ చూపలేదు. అంచనాలు కూడా అంతగా లేవు. నిజానికి ఈ సినిమాను కొనడానికి ఏ డిస్ట్రిబ్యూటర్‌ కూడా సిద్ధంగా లేడు. ట్రైలర్‌ విడుదలయ్యిన తర్వాత సినిమాపై హైప్‌ పెరిగింది.. దానికి తోడు జైశ్రీరామ్ పాట విపరీతంగా ట్రెండింగ్‌ అవుతోంది. ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తోంది. రామాయణం ఆధారంగా నిర్మించిన ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్‌, సీతమ్మగా కృతి సనన్‌లు నటిస్తున్నారు. ఓం రౌత్‌ దర్శకత్వం వహించాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు ఓటీటీ పార్టనర్ లాక్ అయింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది. థియేటర్లో విడుదలైన రెండు నెలల తర్వాత ఆదిపురుష్ మూవీ ఓటీటీలోకి రానుంది. ఇప్పటికే అభిషేక్ అగర్వాల్, రణ్ బీర్ కపూర్, మంచు మనోజ్ ఫ్యామిలీ ఇలా పలువురు అనాధ పిల్లల కోసం ఉచితంగా టిక్కెట్లు స్పాన్సర్ చేస్తున్నారు.

Updated On 14 Jun 2023 4:13 AM GMT
Ehatv

Ehatv

Next Story