స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్, స్టార్ ప్రొడ్యూసర్ ఉండాలే కానీ, సినిమా బిజినెస్ ఇట్టే జరిగిపోతుంది.
స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్, స్టార్ ప్రొడ్యూసర్ ఉండాలే కానీ, సినిమా బిజినెస్ ఇట్టే జరిగిపోతుంది. సినిమా సెట్స్‌లోకి వెళ్లకముందే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు(Digital platforms) క్యూలు కడతాయి. మైత్రీ మూవీస్(Mytri movies) సంస్థ ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో(Prabhas) ఓ సినిమా తీస్తున్నది. హను రాఘవపూడి(Hanu raghava pudi) దర్శకుడు. ఈ భారీ పాన్ ఇండియా మూవీ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమా సౌత్ ఇండియా డిజిటల్ హక్కులు(Digital rights) 150 కోట్ల రూపాయలకు అమ్మినట్టు తెలుస్తోంది. నాన్ థియేటర్ హక్కులలో మేజర్ షేర్ ఈ డిజిటల్ హక్కులే! ఇక శాటిలైట్లు, ఆడియో, హిందీ ఇవన్నీ కలిపితే మరో 150 కోట్ల రూపాయలు ఎక్కడికిపోవు! ఆ లెక్కన ఒక్క నాన్ థియేటర్ హక్కులే 300 కోట్ల రూపాయలకు పైగా వస్తున్నాయన్నమాట! థియేటర్ బిజినెస్ కూడా బాగానే ఉంటుంది. ఇంతేసి సొమ్ము వస్తున్నదంటే పెట్టుబడి కూడా ఆ లెవల్లోనే ఉండాలి. పీరియాడిక్ డ్రామా కాబట్టి ఖరీదైన సెట్లు వేయాల్సి ఉంటుంది. సీజీ పనులు కూడా ఎక్కువే ఉంటాయి. ప్రభాస్ పారితోషికం సంగతి చెప్పేదేముంటుంది? ఎంత పెట్టినా అంతకు అంత రావడం మాత్రం గ్యారంటీ!