రామాయణం ఆధారంగా నిర్మిస్తున్న ఆదిపురుష్‌ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. మంగళవారం సాయంత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ గ్రాండ్‌గా జరగనుంది. శ్రీవారి పాదల చెంత తిరుపతిలో ఈ వేడకను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. చిత్ర యూనిట్‌ తిరుపతికి చేరుకుంది. ఈ సందర్భంగా రామాయణంతో పాటు ఇతర పురాణ కథల ప్రదర్శనలను ఏర్పాటు చేస్తున్నారు. రాముడిగా ప్రభాస్‌ హాలోగ్రామ్‌ కటౌట్‌ను 50 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేశారు.

రామాయణ పారాయణం జరిగే ప్రతి చోటుకు ఆంజనేయస్వామి వస్తాడన్నది నమ్మకం. ఈ విశ్వాసాన్ని గౌరవిస్తూ ఆదిపురుష్ సినిమాని ప్రదర్శించే ప్రతి థియేటర్లో ఒక సీటును హనుమంతుడి కోసం ప్రత్యేకంగా కేటాయించబోతున్నారు.
'అతి గొప్ప రామభక్తునికి గౌరవ మర్యాదలు సమర్పిస్తూ చరిత్రలో కనీవిని ఎరుగని విధంగా ఈ గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టాం. ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ హంగులతో నిర్మించిన 'ఆదిపురుష్' ని హనుమంతుడి సమక్షంలో అందరం తప్పక వీక్షిద్దాం’’ అంటూ మేకర్స్ ఓ పోస్టు పెట్టారు. ఇదలా ఉంటే, అయోధ్య రామాలయ నిర్మాణానికి పెద్ద మొత్తంలో భూరి విరాళాన్ని అందచేయబోతున్నారట ఆదిపురుష్‌ మేకర్స్‌. కనీసం పది నుంచి 50 కోట్ల రూపాయల వరకు ఎంతైనా విరాళం ప్రకటించే అవకాశం ఉందట.

Updated On 6 Jun 2023 12:52 AM GMT
Ehatv

Ehatv

Next Story