నెటిజన్ల నుంచి ట్రోలింగ్ ఫేస్ చేస్తున్న ప్రభాస్‌(Prabhas) ఆదిపురుష్‌ మూవీ(Adipurush  Movie).. అరుదైన రికార్డ్ ను సొంతం చుసుకుని.. ఫ్యాన్స్ లో కొంత లో కొంత పాజిటీవ్ వేవ్ ను సాధించింది. ఇంతకీ ఆదిపురుష్ సాధించిన ఘనత ఏంటి..? ప్రభాస్ చేస్తున్న పాన్ ఇండియ ప్రాజెక్ట్స్(Pan India Projects) లో ఆదిపురుష్ కూడా ఒకటి. ఓం రౌత్‌(Om Raut) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మొదటి నుంచి అన్నీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. పోస్టర్‌ల నుండి టీజర్‌ల వరకు ప్రతీది అభిమానుల నుంచి విమర్శలు తెచ్చిపెట్టాయి.

నెటిజన్ల నుంచి ట్రోలింగ్ ఫేస్ చేస్తున్న ప్రభాస్‌(Prabhas) ఆదిపురుష్‌ మూవీ(Adipurush Movie).. అరుదైన రికార్డ్ ను సొంతం చుసుకుని.. ఫ్యాన్స్ లో కొంత లో కొంత పాజిటీవ్ వేవ్ ను సాధించింది. ఇంతకీ ఆదిపురుష్ సాధించిన ఘనత ఏంటి..?

ప్రభాస్ చేస్తున్న పాన్ ఇండియ ప్రాజెక్ట్స్(Pan India Projects) లో ఆదిపురుష్ కూడా ఒకటి. ఓం రౌత్‌(Om Raut) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మొదటి నుంచి అన్నీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. పోస్టర్‌ల నుండి టీజర్‌ల వరకు ప్రతీది అభిమానుల నుంచి విమర్శలు తెచ్చిపెట్టాయి. దాంతో అయోమయంలో పడ్డారు మూవీ టీమ్. రామాయణం చూపిస్తారంటే.. బొమ్మలాట పెట్టారేంటి అని.. టీజర్ చూసి ఆడియన్స్ పెదవి విరిచారు. అంతే కాదు ప్రభాస్ లాంటి ఆరడుగుల అందగాడు దొరికినప్పుడు అతన్ని రాముడిగా ఇంకెంత అందంగా చూపించవచ్చు అనే సలహాలు ఇస్తూ.. డైరెక్టర్ ఓం ను గట్టిగా ఇచ్చుకున్నారు ఫ్యాన్స్.

ఒక వర్గానికి చెందిన ప్రేక్షకులైతే ఏకంగా.. ఆదిపురుష్ సినిమా రిలీజ్‌ను ఆపేయాలని డిమాండ్‌ కూడా చేశారు. ముఖ్యంగా వీఎఫ్‌ఎక్స్‌పై ఎక్కడలేని విమర్శలు వచ్చాయి. చిన్న పిల్లల కార్టూన్స్ కంటే దారుణమైన క్వాలిటీతో గ్రాఫిక్స్ చేశారన్నారు. దాంతో మేకర్స్‌ మరో వంద కోట్లతో మెరుగైన వీఎఫ్‌ఎక్స్‌ను టీమ్ రీ కన్ స్ట్రక్ట్ చేస్తున్నారు. ఎన్నో విమర్షల తరువాత ఒక పాజిటీవ్ వేవ్ ను సాధించింది ఓం రౌత్ టీమ్. రిలీజ్ కు ముందే ఆదిపురుష్ అరుదైన ఘనతను సాధించింది.

సినీ రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే ట్రిబెకా ఫెస్టివల్‌(Tribeca Festival)లో ఆదిపురుష్‌ సినిమాను ప్రదర్శించబోతున్నారు. న్యూయార్క్‌లో జరిగే ఈ ప్రఖ్యాత కళల ఉత్సవంలో జూన్‌ 13న ఆదిపురుష్‌ సినిమా ప్రదర్శితం కాబోతుంది. ఇదే విషయాన్ని ఓరౌత్‌ సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఇది గౌరవం, సంతోషానికి మించింది. ఆదిపురుష్ మూవీ జూన్ 13న ట్రిబెకా ఫెస్టివల్‌లో ప్రదర్శితం కాబోతుంది. ఈ సినిమాను ఎంపిక చేసిన ట్రిబెకా జ్యూరి మెంబర్స్‌కు నా ధన్యవాదాలు. ఆ వేడుక కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నా అంటూ పోస్ట్‌ వేశాడు. ప్రస్తుతం ఇది తెగ వైరల్ అవుతుంది. ఓం రౌత్ తో పాటు ప్రభాస్ కూడా ఈ ఘనతపై స్పందించాడు. తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి.. సంతోషాన్ని వ్యక్తం చేశాడు.

తాన్హాజీ సినిమా(Tanhaji movie)తో ఫేమస్ అయిన ఓం రౌత్... ఆదిపురుషక్ తో తెగ కష్టపడుతున్నాడు. ఇక రాముడిగా ప్రభాస్‌.. ఆయన జోడీ సీతగా కృతి సనన్‌ నటించింది. సైఫ్‌ అలీఖాన్‌ విలన్ రావణాసురుడుగా కనిపించనున్నాడు. టీ-సిరీస్‌, రెట్రో ఫైల్స్ సంస్థలు అత్యంత భారీ బడ్జెట్‌తో దాదాపు 500 కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాను జూన్‌ 16న పాన్‌ ఇండియా లెవల్లో గ్రాండ్‌గా రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.

Updated On 19 April 2023 5:06 AM GMT
Ehatv

Ehatv

Next Story