రామాయణం ఆధారంగా నిర్మించిన ఆదిపురుష్(Adipurush) సినిమా గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్(Prabhas) రాముడిగా, కృతి సనన్(Kriti Sanon) సీతగా, సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) రావణాసురుడిగా నటించిన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర తుస్సుమంది. ఈ సినిమా టీజర్, పోస్టర్లు రిలీజ్ చేసినప్పుడే ఫ్యాన్స్‌కు అనుమానమొచ్చేసింది. ఎక్కడో తేడా కొడుతోంది. అసలీ చితరం వర్కవుట్ అవుతుందా?
రామాయణం ఆధారంగా నిర్మించిన ఆదిపురుష్(Adipurush) సినిమా గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్(Prabhas) రాముడిగా, కృతి సనన్(Kriti Sanon) సీతగా, సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) రావణాసురుడిగా నటించిన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర తుస్సుమంది. ఈ సినిమా టీజర్, పోస్టర్లు రిలీజ్ చేసినప్పుడే ఫ్యాన్స్‌కు అనుమానమొచ్చేసింది. ఎక్కడో తేడా కొడుతోంది. అసలీ చితరం వర్కవుట్ అవుతుందా? అని డౌట్ పడ్డారు. అన్నేసి వందల కోట్లు ఖర్చు చేసి ఇంత నాసిరకంగా, ఇంత నిర్లక్ష్యంగా ఈ సినిమా తీస్తున్నారేమిటి అని కోపం కూడా తెచ్చుకున్నారు. దీంతో దర్శకుడు ఓం రౌత్ మరికాస్త సమయం తీసుకుని కాసింత మెరుగైన టీజర్‌ను విడుదల చేశారు. ఆ టీజర్‌ను చూసిన ప్రేక్షకులు పోన్లే మార్పులు అయితే చేశాడని సంతృప్తి చెందారు. సినిమాలో గ్రాఫిక్స్ బాగానే ఉంటాయని భావించారు. జూన్ 16వ తేదీన సినిమా విడుదలయ్యింది. థియేటర్‌కు వెళ్లి సినిమా చూసిన ప్రేక్షకులు బిక్క మొహం వేశారు. సినిమాపై పెదవి విరిచారు. సినిమాలోని డైలాగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకు ముందు వచ్చిన రామాయణం సినిమాలు చూసిన వారికి, ఆ కథను విన్నవారికి సినిమా ఏ మాత్రం నచ్చలేదు. ఫలితంగా సినిమా విడుదలైన మొదటి షో నుంచే నెగెటివిటీ పెరిగింది. దర్శకుడు దగ్గర సమర్థించుకోవడానికి ఏమీ లేకుండా పోయింది. ఫలితంగా ఆదిపురుష్‌కు దెబ్బపడింది. దాదాపు 700 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల రూపాయల మేర వసూళ్లు రాబట్టింది. ఎన్నో విమర్శలు, వివాదాలను దాటుకుని ఆ మాత్రం వసూళ్లు రాబట్టడమే గ్రేటు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో ప్రత్యక్షమయ్యింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆదిపురుష్ ఓటీటీ హక్కులను ప్రైమ్ వీడియో 150-200 కోట్ల రూపాయలు పెట్టి మరీ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి బాక్సాఫీస్ దగ్గర చతికిలపడ్డ ఈ సినిమాకు ఓటీటీలో స్పందన ఎలా ఉంటుందో ఏమో!