రామాయణం రసభరితం.. రమణీయం, కమనీయం ..అనుదినము స్మరణీయం .. ఎంత మంది కవులు ఎన్ని తీర్లు రాసినా రామాయణం నిత్య నూతనంగానే ఉంటుంది. అందుకే వెండితెరపై ఎన్నిసార్లు రామాయణగాధలు వచ్చినా ప్రేక్షకులు ఆదరించారు. ఇప్పుడు ఆదిపురుష్ గురించి అందరూ మాట్లాడుతున్నారంటే అందుకు కారణం అది ఆ రామ చరిత్ర గొప్పదనం. శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఇప్పటికే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మూడు రోజులు టికెట్లన్నీ అయిపోయాయి.
రామాయణం రసభరితం.. రమణీయం, కమనీయం ..అనుదినము స్మరణీయం .. ఎంత మంది కవులు ఎన్ని తీర్లు రాసినా రామాయణం నిత్య నూతనంగానే ఉంటుంది. అందుకే వెండితెరపై ఎన్నిసార్లు రామాయణగాధలు వచ్చినా ప్రేక్షకులు ఆదరించారు. ఇప్పుడు ఆదిపురుష్ (Adipurush) గురించి అందరూ మాట్లాడుతున్నారంటే అందుకు కారణం అది ఆ రామ చరిత్ర గొప్పదనం. శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఇప్పటికే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మూడు రోజులు టికెట్లన్నీ అయిపోయాయి. ఇలాంటి సమయంలో ఈ సినిమా సరికొత్త రికార్డును సాధించింది. ప్రభాస్ (Prabhas రాముడిగా నటించిన ఆదిపురుష్ సినిమా టీజర్‌ను గత ఏడాది విడుదల చేశారు. అప్పుడు ఈ సినిమాపై ఘోరమైన ట్రోల్స్ వచ్చాయి. గ్రాఫిక్స్‌ను చూసి నెటిజన్లు తిట్టుకున్నారు. థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అయితే ఎవరైనా చూస్తారా అన్న సందేహం కూడా వచ్చింది. అయితే ట్రైలర్స్ విడుదలయ్యాక సినిమాపై హైప్ పెరిగింది. ఆదిపురుష్‌పై ఆసక్తి పెరిగింది. ఇదే ఆసక్తిని, అభిమానాన్ని, ఇష్టాన్ని చాలా మంది సోషల్ మీడియాలో చూపించారు. మరికొందరు టికెట్లు అమ్మే బుక్ బై షోలో లైక్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇప్పటి వరకు 1.1 మిలియన్ యూజర్స్ .. ఈ టికెట్ బుకింగ్ సైట్‌లో లైక్ కొట్టారు. దీంతో వన్ మిలియన్ మార్క్ అందుకున్న సినిమాగా ఆదిపురుష్ రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు ఆర్‌ఆర్‌ఆర్ సినిమా 1.75 మిలియన్ లైక్స్‌తో టాప్‌లో ఉంది. అయితే మొదటి రోజే 1.1 మిలియన్ లైక్స్ రావడం మాత్రం విశేషం!