✕
Adhipurush Movie : ఆదిపురుష్ సినిమాకు తప్పని తిప్పులు, మరో వివాదంలో ప్రభాస్ సినిమా..
By EhatvPublished on 13 May 2023 2:00 AM GMT
మొదటి నుంచి ఏదో ఒక వివాదంలో నలుగుతూనే ఉంది ఆదిపురుష్ సినిమా.. ఇక అన్నీ దాటుకుని ట్రైలర్ వరకూ వచ్చిందిలే అనుకున్న సమయానికి.. మరో సారి ఈమూవీపై కాంట్రవర్సీ తప్పేలా లేదు.

x
Adhipurush Movie
-
- మొదటి నుంచి ఏదో ఒక వివాదంలో నలుగుతూనే ఉంది ఆదిపురుష్ సినిమా.. ఇక అన్నీ దాటుకుని ట్రైలర్ వరకూ వచ్చిందిలే అనుకున్న సమయానికి.. మరో సారి ఈమూవీపై కాంట్రవర్సీ తప్పేలా లేదు.
-
- యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కృతీ సనన్, సైఫ్ అలీ ఖాన్ లాంటి స్టార్ కాస్ట్ తో.. రామాయణ ఇతివృత్తాన్ని తీసుకుని..ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్న భారీ బడ్జెట పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్. రాముడిగా ప్రభాస్.. సీతగా బాలీవుడ్ బ్యూటీ కృతీసనన్ నటిస్తోన్న సినిమాలో రావణ బ్రహ్మగా సైఫ్ అలీఖాన్ నటించారు. . అయితే ఈ మూవీపై మొదటి నుంచీ నెగెటీవ్ టాక్ ను మూటగట్టుంది.
-
- అప్ డేట్స్ ఇవ్వలేదని ప్రభాస్ ఫ్యాన్స్ , ఇచ్చిన అప్ డేట్స్ బాలేవని ఆడియన్్ గట్టిగానే ట్రోల్ చేశారు ఆదిపురుష్ ను. ఇక లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన టీజర్ బొమ్మలాటలాఉందిఅన్న విమర్షలు వచ్చాయి. దాంతో వాటిని సరిచేసుకుని ట్రైలర్ రిలీజ్ వరకూ తీసుకువచ్చారు ఆదిపురుష్ ను. అటు హిందూవాదుల నుంచి కూడా.. రామాయణం వక్రీకరించారు అన్న విమర్షలు ఏదుర్కొన్నారు టీమ్.
-
- తాజాగా టీజర్ దెబ్బకు .. డైరెక్టర్ ఓం రౌత్ కాస్త మేలుకున్నాడు.. గ్రాఫీక్స్ వర్క్ ను సరిచేయించి.. వరుసగా అప్ డేట్స్ వదిలాడు. అందులో బాగంగానే రీసెంట్ గా భారీ ఎత్తున ఆదిపురుష్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మూవీ టీమ్. ఇక ఈ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో పాటు.. టీజర్ వల్ల వచ్చిన బ్యాడ్ నేమ్ ను కాస్త పాజిటీవ్ గా మార్చుకోగలిగారు టీమ్. రాముడిగా ప్రభాస్ అద్భుతంగా కనిపించాడు. మిగతా పాత్రలు కూడా అద్భుతంగా ఉన్నాయి. టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
-
- కాని అంత తేలిగ్గా.. ఆదిపురుష్ ను వివాదాలు వదిలేలా కనిపించడం లేదు. రామాయణాన్నా గ్రాఫిక్స్ కథలతో ప్రేక్షకుల దగ్గరకు తప్పుగా తీసుకెళ్లే ప్రభావం ఉంటుందేమో అన్న అనుమానం కొంత మందిలో కలిగింది.ఇలాంటి సమయంలో ఆదిపురుష్ సినిమాపై సెన్సార్ బోర్డులో తాజాగా ఓ ఫిర్యాదు నమోదైంది.సనాతన్ ఘర్మ ప్రచారకర్త సంజయ్ దీనానాథ్ తివారీ..ఈ కంప్లైంట్ ఇచ్చారు. బాంబే హైకోర్టు లాయర్ ఆశిష్ రాయ్, పంకజ్ మిశ్రా ద్వారా అతను ఈ కంప్లైట్ ఫైల్ చేశారు. థియేటర్లలో ఈ మూవీని రిలీజ్ చేయడానికి ముందు.. స్పెషల్ స్క్రీన్ టెస్ట్ ఏర్పాటు చేయాలని.. తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన లెటర్ ఇప్పుడు వైరల్ గా మారింది. ‘
-
- ముఖ్యంగా ఆదిపురుష్ టీమ్ గతంలో చేసిన తప్పులను సాకుగా చూపించారు. టీమ్ మెంబర్స్ గతంలో ఆర్టిస్టులు, పోస్టర్ల విషయంలో చాలా తప్పులు చేశారని పేర్కొన్నారు. ఒకవేళ అవి సినిమాలోనూ ఉంటే తమ మనోభావాలు దెబ్బతింటాయని అన్నారు. దీనివల్ల శాంతిభద్రతల ముప్పు కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు. దాంతో ఆదిపురుష్ కు మరోసారి ఇబ్బందులు తప్పేలా లేవు. రిలీజ్ వరకూ ఇంకెన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తుందో చూడాలి.

Ehatv
Next Story