పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌కు (Pawan Kalyan) క్షణం తీరిక లేదు. ఓ పక్క పార్టీ పనులు, మరో పక్క సినిమా షూటింగులతో పవన్ బిజీ అయిపోయారు. వరుస సినిమాలలో నటిస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్నారు. సుజిత్ (Sujeeth) దర్శకత్వంలో పవన్ కల్యాణ్ ఓజీ అన్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే కదా! ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ (Gangstar) అన్న మాట.

pawan kalyan as gangster in og movie
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌కు (Pawan Kalyan) క్షణం తీరిక లేదు. ఓ పక్క పార్టీ పనులు, మరో పక్క సినిమా షూటింగులతో పవన్ బిజీ అయిపోయారు. వరుస సినిమాలలో నటిస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్నారు. సుజిత్ (Sujeeth) దర్శకత్వంలో పవన్ కల్యాణ్ ఓజీ అన్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే కదా! ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ (Gangstar) అన్న మాట. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న ఈ సినిమాలో పవన్ పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబం ధించిన రెండు షెడ్యూళ్లు పూర్తయ్యాయి. ముంబయి, హైదరాబాద్, మహాబలిపురంలో జరిపిన షెడ్యూల్స్‌లో యాక్షన్ ఘట్టాలతో పాటు ఓ పాటను తెరకెక్కించారు. జూన్ మొదటివారంలో ఈ సినిమా మూడో షెడ్యూల్‌ను మొదలుపెట్టనున్నారు. సాధ్యమైనంత తొందరలో చిత్రాన్ని పూర్తి చేయాలన్న ఉద్దేశంలో పవన్ ఉన్నారట. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ (DVV Entertainments) పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
