వరుస సినిమాలతో.. జోరు మీద ఉన్నాడు పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ (Pawan Kalyan). వరుస షూటింగ్స్‏లో బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం ఓజీ షూటింగ్‏లో సందడి చేస్తున్నాడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం..యమా జోరు మీద ఉన్నాడు.

వరుస సినిమాలతో.. జోరు మీద ఉన్నాడు పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ (Pawan Kalyan). వరుస షూటింగ్స్‏లో బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం ఓజీ షూటింగ్‏లో సందడి చేస్తున్నాడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం..యమా జోరు మీద ఉన్నాడు. యంగ్ డైరెక్టర్ సుజిత్‏ (Sujeeth)తో కలిసి.. ఓజీ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈమూవీ షూటింగ్ సూపర్ ఫాస్ట్‏గా కొనసాగుతుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా షూటింగ్‏లో పవర్ స్టార్ పవన్ కళ్యాన్‏తో పాటు.. తాజాగా సీనియర్ యాక్టర్ ప్రకాశ్‏రాజ్ (Prakash Raj) కూడా షూటింగ్‏లో పాల్గొన్నారు. ఆయనపై పలు కీలక సన్నివేశాలను షూటింగ్ చేస్తున్నారు.

ఇక ఈ మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్‏గా కనిపించనున్నారు. ఇప్పటికే ముంబయిలోఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకోబోతున్నారు. ముంబయ్‏లో కంప్లీట్ అయిన తరువాత వెంటనే సెకండర్ షెడ్యూల్‏ను త్వరలోనే పుణేలో జరపబోతున్నట్టు తెలుస్తోంది. పూణే షెడ్యూల్‏లో మూవీకి సబంధించిన మెయిన్ కాస్ట్ అండ్ క్రూ పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది.

ఓజీ (OG) మూవీని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈమూవీలో పవన్ కల్యాణ్ సరసన తమిళ భామ ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Mohan) హీరోయిన్‏గా నటిస్తోంది. డీవీవీ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్‏పై డీవీవీ దానయ్య (DVV Danayya) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ (Thaman S) సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై పవర్ స్టార్ ఫ్యాన్స్‏లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈమూవీని వచ్చే డిసెంబర్ వరకూ రిలీజ్ చేయాలని చూస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ,కన్నడ,హిందీ,మలయాళ భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు పవర్ స్టార్. ఓజితో పాటు క్రిష్ డైరెక్షన్‏లో హరిహరవీరమల్లు, సముద్రఖనితో తమిళ రీమేక్ మూవీ.. హరీష్ శంకర్‏తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు లైన్‏లో ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమాలన్నీ షూటింగ్ దశలో ఉన్నాయి.

Updated On 29 April 2023 1:55 AM GMT
Ehatv

Ehatv

Next Story