తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ(Telugu Film Industry)లో బహుముఖ ప్రజ్ఙాశాలిగా పేరు సాధించిన వ్యక్తి పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali). ఆయన ప్రస్తుతం కరోనా(Corona) బారిన పడ్డారు. వెంటనే హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు పోసాని కృష్ణ మురళీ. టాలీవుడ్ లో మల్టీ టాలెంటెడ్ స్టార్ గా పేరుపొందిన నటుడు పోసాని కృష్ణ మురళి. రచయితగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి.. నటుడిగా మారిన ఆయన.. దర్శకుడిగా కూడా తన సత్తా చాటుకున్నాడు. సినీ పరిశ్రమలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ(Telugu Film Industry)లో బహుముఖ ప్రజ్ఙాశాలిగా పేరు సాధించిన వ్యక్తి పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali). ఆయన ప్రస్తుతం కరోనా(Corona) బారిన పడ్డారు. వెంటనే హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు పోసాని కృష్ణ మురళీ.
టాలీవుడ్ లో మల్టీ టాలెంటెడ్ స్టార్ గా పేరుపొందిన నటుడు పోసాని కృష్ణ మురళి. రచయితగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి.. నటుడిగా మారిన ఆయన.. దర్శకుడిగా కూడా తన సత్తా చాటుకున్నాడు. సినీ పరిశ్రమలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పోసాని ఏపీ ప్రభుత్వ చలనచిత్ర టీవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. రీసెంట్ గా ప్రెస్ మీట్ పెట్టి బాలకృష్ణ తో పాటు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నందీ అవార్డ్ లపై కూడా పోసాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక తాజాగా ఆయనకు కరోనా సోకినట్టు తెలుస్తోంది.
పోసాని కృష్ణ మురళికి కరోనా సోకడంతో ఆయన్ను హైదరాబాద్‌లోని ఏఐజి ఆసుపత్రి(AGI Hospital)కి తరలించారు.పూణే(Pune)లో జరిగిన షూటింగ్‌లో పాల్గొని నిన్ననే హైదరాబాద్(Hyderabad)కు వచ్చిన పోసాని కృష్ణ మురళికు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కాగా పోసానికి కరోనా పాజిటివ్ రావడం ఇది మూడోసారి. కాగా..తెలంగాణలో క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న 45 కరోనా కేసులు నమోదు కాగా.. హైదరాబాద్‌లోనే 18 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సూచనలు చేసింది.
కరోనా వైరస్(Corona Virus)..ఎప్పుడో అంతరించిపోయింది... మళ్లీ వచ్చే ఛాన్సే లేదు... అనుకునేలోపే మళ్లీ విజృంబిస్తుంది కరోనా వైరస్. ప్రజల నిర్లక్ష్యం మళ్ళీ కేసులు పెరగడానికి కారణమవుతోంది. అయితే ప్రస్తుతం దేశంలో కోవిడ్ ఎండమిక్ స్టేలోకి ప్రవేశిస్తోందని, రాబోయే పది నుంచి 12 రోజుల్లో కేసులు బాగా పెరుగుతాయని, ఆ తర్వాత కేసులు తగ్గుతాయని వైద్యులు చెప్పిన మాట కాసింత ఊరటనిస్తోంది. కొద్ది రోజులుగా కరోనా కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయ. తాజాగా 2,21,725 మందికి కరోనా టెస్టులు చేస్తే 11,109 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది.