నటి పూనమ్‌కౌర్‌కు(Poonam kaur) పవన్‌కల్యాణ్(Pawan kalyan) అన్నా, త్రివిక్రమ్(Trivikram) అన్నా ఓ పట్టాన పట్టదు.
నటి పూనమ్‌కౌర్‌కు(Poonam kaur) పవన్‌కల్యాణ్(Pawan kalyan) అన్నా, త్రివిక్రమ్(Trivikram) అన్నా ఓ పట్టాన పట్టదు. తరచూ వారిద్దరిపై పరోక్షంగా విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. ఇప్పుడు డైరెక్ట్‌గానే తిట్టిపోస్తున్నారనుకోండి.. ప్రస్తుతం నయనతార(Nayanthara)- ధనుష్(Danush) వివాదం సోషల్ మీడియాలో(Social media) హాట్ టాపిక్‌గా మారింది కదా! నయనతారపై నెట్‌ఫ్లిక్స్(Netflix) ఒక డాక్యుమెంటరీని(Documentry) తీసిన సంగతి తెలిసిందే. ఈ డాక్యుమెంటరీ కోసం తాను నటించిన నానుమ్ రౌడీ దాన్(Nann rowdy dhan) సినిమాలో నుంచి 3 సెకన్ల వీడియోను ఈ వాడుకున్నారు నయనతార. అయితే ఈ 3 సెకన్ల వీడియోను ఉపయోగించుకున్నందుకు నయనతారకు చిత్ర నిర్మాత ధనుష్ లీగల్ నోటీసులు పంపించాడు. 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడు. దీంతో ఈ వివాదంపై విసిగిపోయిన నయనతార సోషల్ మీడియా వేదికగా ధనుష్‌పై విమర్శులతో కూడిన ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. అయితే ఈ విషయంలో నయనతారకు ఇండస్ట్రీ నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఇప్పటికే మలయాళ నటీమణులు పార్వతి తిరువోతుతో పాటు, అనుపమ పరమేశ్వరన్(Anupama parmeshwaran) కూడా నయనతారకు మద్దతుగా నిలిచారు. ఇక టాలీవుడ్ నుంచి కూడా నటి పూనమ్ కౌర్ కూడా నయనతారకు మద్దతుగా నిలిచారు. అయితే పూనం చేసిన కామెంట్‌పై ఒక నెటిజన్ స్పందిస్తూ.. ఎందుకు అమ్మ. తన కంటెంట్‌ని అమ్ముకుని కాష్ చేసుకునే హక్కు తనకి ఉన్నపుడు, ధనుష్ కంటెంట్‌ని ధనుష్ కాష్ చేసుకునే హక్కు ఉండదా అని ప్రశ్నించాడు. దీనిపై పూనమ్ కౌర్ సమయోచితంగానే స్పందించారు. దర్శకుడు త్రివిక్రమ్‌ను ఇందులోకి లాగారు. ఇదే లాజిక్ ప్రకారం త్రివిక్రమ్ కూడా కంటెంట్‌ను కాపీ చేస్తాడు దీని గురించి ఏమంటారు? అంటూ బదులిచ్చారు. అయితే పూనమ్ కౌర్ పోస్టుపై కూడా నెటిజన్లు రియాక్టవుతున్నారు. ప్రతిసారి త్రివిక్రమ్‌ను తీసుకోస్తావు కానీ అసలు ఏం జరిగిందో మాత్రం చెప్పవు అంటూ కామెంట్లు పెడుతున్నారు.