అతను తన తప్పుడు హామీలతో ఎంతో మంది జీవితాలను నాశనం చేశాడని ఆమె

పూనమ్‌కి త్రివిక్రమ్‌తో వ్యక్తిగత సమస్యలున్నాయన్నది చాలా అంశాల్లో బయట పడింది. చాలా సార్లు గురూజీ అనే వ్యక్తి బూటకపు వాగ్దానాల వల్ల తాను చాలా ప్రభావితమయ్యానని.. అతను తన తప్పుడు హామీలతో ఎంతో మంది జీవితాలను నాశనం చేశాడని ఆమె ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పేర్కొంది. ఆమె టార్గెట్ చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ లేదా త్రివిక్రమ్ ఇప్పటివరకు స్పందించలేదు. ఇంతకూ ఏమి జరిగిందో ఎవరికీ తెలియనప్పటికీ, పూనమ్ కౌర్ మాత్రం త్రివిక్రమ్ నకిలీ వాగ్దానాల వల్ల ఆమె వ్యక్తిగతంగా ప్రభావితమైందని చాలామంది నమ్ముతారు.

తాజాగా పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రసంగంలో భాగంగా త్రివిక్రమ్‌ గురించి ప్రస్థావించాడు. తనకు పులి, సింహం అంటూ డైలాగ్స్ చెప్పడం అంతగా ఇష్టం ఉండదని, అత్తారింటికి దారేది సినిమాలో 'సింహం గడ్డం గీసుకోదు.. నేను గీసుకుంటాను' అనే డైలాగ్‌ను చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డాను.. దీంతో త్రివిక్రమ్ గారు కామెడీగా చెప్పండని అన్నారు. కామెడీగా అయితే ఏదైనా చెప్పేస్తాను అంటూ నాడు జరిగిన ఘటన గురించి పవన్ కళ్యాణ్ వివరించారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఒక న్యూస్ పోర్టల్ చేసిన ట్వీట్ కింద పూనమ్ కౌర్ త్రివిక్రమ్ ను ఒక్క మాటతో తిట్టేసింది. యూజ్ లెస్ ఫెల్లో అంటూ త్రివిక్రమ్ పేరును పెట్టేసి తిట్టేసింది. మొదటి సారి.. ఇలా త్రివిక్రమ్ పేరును చెప్పేసింది పూనమ్ కౌర్.

Updated On 21 Feb 2024 11:21 PM GMT
Yagnik

Yagnik

Next Story