అసలే అవకాశాలు లేక.. ఐరన్ లెగ్ అనే పేరుతెచ్చుకుంది పూజాహెగ్డే.
![Pooja Hegde: నోరు జారిన పూజా హెగ్డే, పరువు తీసేసిందిగా.. ఇలా అనేసిందేంటి..? Pooja Hegde: నోరు జారిన పూజా హెగ్డే, పరువు తీసేసిందిగా.. ఇలా అనేసిందేంటి..?](https://www.ehatv.com/h-upload/2025/02/06/740675-07.webp)
అసలే అవకాశాలు లేక.. ఐరన్ లెగ్ అనే పేరుతెచ్చుకుంది పూజాహెగ్డే. ఇప్పుడిప్పుడే .. మళ్ళీ అవకాశాలు అందుకుంటోంది. టాలీవుడ్(Tollywood)లో మాత్రం పూజాకు అవకాశం ఇవ్వడానికి నిర్మాతలు భపడుతున్నారు. కాని తమిళ, హిందీ పరిశ్రమ నుంచి ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. ఇక టాలీవుడ్ లో అసలే ఐరెన్ లెగ్ అన్న పేరు వచ్చింది. ఇక్కడ ఎంత జాగ్రత్తగా ఉండాలి. కాని పూజా హెగ్డే (Pooja Hegde)టాలీవుడ్ వియంలోనే నోరు జారింది.
పూజా హెగ్డేకి లైఫ్ ఇచ్చింది టాలీవుడ్. తెలుగు పరిశ్రమలో దాదాపు స్టార్ హీరోలందరితో నటించింది పూజా. గతకొంత కాలంగా టాలీవుడ్‌లో సరైన హిట్స్ లేకపోవడంతో, ప్రస్తుతం ఆమె తన ఫోకస్ పూర్తిగా బాలీవుడ్‌పైనే పెట్టింది. బాలీవుడ్ లో రీసెంట్ గా ఆమె నటించిన ‘దేవా’ (Deva)సినిమా రిలీజ్ అయ్యింది. ఈసినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేసిన పూజా.. ప్రమోషన్ ఈవెంట్ లో చేసిన కామెంట్ సంచలనంగా మారింది. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
దక్షిణాదిలో తాను నటించిన ‘అల వైకుంఠపురములో(Ala Vaikuntapuramloo)’ తమిళ సినిమా అయినా కూడా హిందీ ఆడియెన్స్ దానిని పాన్ ఇండియా మూవీగా చాలా బాగా ఆదరించారని.. పనితనం బాగుంటే, అది ప్రేక్షకులకు నచ్చుతుందని ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన ‘అల వైకుంఠపురములో’ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram)డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది.
దాంతో ఆడియన్స్ మండిపడుతున్నారు. నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. తాను నటించిన సినిమా ఏ భాషలోదో కూడా గుర్తులేకపోవడం ఆశ్చర్యం అంటున్నారు. తనకు లైఫ్ ఇచ్చిన టాలీవుడ్ నే మర్చిపోయిందంటూ విమర్శిస్తున్నారు. ఇలా తాను నటించిన తెలుగు బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తమిళ్ మూవీ అని చెప్పడంపై బన్నీ ఫ్యాన్స్ కూడా గరం అయితున్నారు. అంతే కాుద పూజా హెగ్డేను సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక ఇంత వరకూ ఈ కామెంట్స్ పై పూజా స్పందించలేదు. మరి తరువాత అయిన స్పందిస్తుందేమో చూడాలి.
![ehatv ehatv](/images/authorplaceholder.jpg?type=1&v=2)