పూజ హెగ్డే మరో బాలీవుడ్ సినిమాకు కూడా సైన్ చేసింది.
పూజా హెగ్డే తన కెరీర్‌లో ఇటీవల వరుస ఫ్లాప్ లను చవి చూసింది. పలు భాషల్లో ఆమె నటించిన సినిమాలు పరాజయం పాలవ్వగా.. కొన్ని సినిమాల నుండి ఆమె బయటకు వచ్చేసింది. తాజాగా హిందీ సినిమాలో నటించబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. పూజ హెగ్డే తదుపరి 'సంకి' అనే రొమాంటిక్ డ్రామాలో అహన్ శెట్టి సరసన నటించనుంది. ప్రముఖ చిత్రనిర్మాత సాజిద్ నడియాద్‌వాలా ఈ వెంచర్‌ను బ్యాంక్రోల్ చేయనుండగా, అద్నాన్ ఎ. షేక్, యాసిర్ షా సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహిస్తారు. ఈ చిత్రం 2025 వాలెంటైన్స్ డే రోజున ప్రేక్షకుల ముందుకు రానుంది. అజయ్ భూపతి RX 100 (2018)కి రీమేక్ అయిన తడప్ (2021)తో తన నటనా రంగ ప్రవేశం చేసిన అహన్‌కి ఇది రెండవ చిత్రం.
పూజ హెగ్డే మరో బాలీవుడ్ సినిమాకు కూడా సైన్ చేసింది. ఆమె 'దేవా' పేరుతో తెరకెక్కుతున్న ఒక పోలీసు డ్రామాలో నటిస్తూ ఉంది. షాహిద్ కపూర్‌తో రొమాన్స్ చేయడానికి ఆమె సంతకం చేసింది. ఈ సినిమాకు రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించనున్నారు. పూజా హెగ్డే చివరిసారిగా సల్మాన్ ఖాన్ కిసీ కా భాయ్ కిసీ కి జాన్ (2023)లో కనిపించింది. ఆ తర్వాత ఆమె పలు సినిమాల నుండి తప్పుకుంది. గుంటూరు కారం సినిమాలో మెయిన్ లీడ్ రోల్ మొదట పూజా హెగ్డేనే చేయాల్సి ఉండగా.. ఆమె స్థానంలో శ్రీలీలను తీసుకున్నారు.