రెండేళ్ల కిందటి వరకు పూజ హెగ్డే(Pooja Hegde) టాలీవుడ్‌ టాప్‌ స్టార్‌. టాలీవుడ్‌లోనే కాదు, కోలీవుడ్‌లో కూడా పూజా హెగ్డేకు డిమాండ్‌ ఉండింది. ఏమైందో ఏమో కానీ సడన్‌గా పూజా హెడ్గేకు డిమాండ్‌ తగ్గింది. ఆమె సినిమాలు వరుసగా ఫ్లాప్‌ కావడం ఓ కారణం కావచ్చు. బాలీవుడ్‌లో మళ్లీ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు. అక్కడ కూడా క్లిక్‌ కాలేదు. ఇప్పుడిప్పుడే ఆమెకు మళ్లీ అవకాశాలు వస్తున్నాయి.

రెండేళ్ల కిందటి వరకు పూజ హెగ్డే(Pooja Hegde) టాలీవుడ్‌ టాప్‌ స్టార్‌. టాలీవుడ్‌లోనే కాదు, కోలీవుడ్‌లో కూడా పూజా హెగ్డేకు డిమాండ్‌ ఉండింది. ఏమైందో ఏమో కానీ సడన్‌గా పూజా హెడ్గేకు డిమాండ్‌ తగ్గింది. ఆమె సినిమాలు వరుసగా ఫ్లాప్‌ కావడం ఓ కారణం కావచ్చు. బాలీవుడ్‌లో మళ్లీ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు. అక్కడ కూడా క్లిక్‌ కాలేదు. ఇప్పుడిప్పుడే ఆమెకు మళ్లీ అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడా మంగళూరు సోయగం ప్రేమలో(Love) పడింది. అదే ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. హిందీ సీరియల్ నటుడు, బిగ్‌బాస్‌ సీజన్‌ 10 ఫేమ్‌ రోహన్‌ మెహ్రతో పూజా ప్రేమలో పడిందని బాలీవుడ్‌ కోడై కూస్తున్నది. గత కొంత కాలంగా పూజా హెగ్డే హాజరవుతున్న ప్రతి ప్రైవేటు ఫంక్షన్‌లలో రోహన్‌ మెహ్రా(Rohan Mehra) కనిపిస్తున్నాడు. మొన్నీ మధ్యన పూజా హెగ్డే తన ఫ్యామిలీ మెంబర్లతో కలిసి ఓ రెస్టారెంట్‌కు వెళ్లింది. అక్కడ కూడా రోహన్ కనిపించాడు. అంతే కాదు ఆమె కుటుంబసభ్యలతో కలిసి ఫోటోలు దిగాడు. పూజా అతడితో డేటింగ్‌లో ఉన్నట్టు వార్తలు రావడానికి ఇవన్నీ కారణాలయ్యాయి. వీరిద్దరి ప్రేమబంధానికి కుటుంబ సభ్యుల ఆమోదం కూడా ఉందట! అందుకే పూజా హెగ్డే కుటుంబసభ్యులతో రోహన్‌ మెహ్రా సన్నిహితంగా ఉంటున్నాడట! ఇందులో నిజమెంతో తెలియదు. ఇద్దరిలో ఎవరో ఒకరు పెదవి విప్పితే కానీ అసలు విషయం తెలియదు. గత రెండేళ్లుగా తెలుగు సినిమాలకు పూజా హెగ్డే దూరంగా ఉంటోంది. గుంటూరుకారంలో నటించాల్సి ఉండింది కానీ ఎందుకో ఆ అవకాశం చేజారింది. ప్రస్తుతం హిందీలో దేవా అనే సినిమాలో నటిస్తున్నది.

Updated On 20 April 2024 5:04 AM GMT
Ehatv

Ehatv

Next Story