బుట్టబొమ్మకు కాలం కలిసి వస్తోంది. తంతే బూరలబుట్టలో పడినట్టయింది. వరుస ఫ్లాపులతో నిరాశ నిస్పృహలతో ఉన్న పూజా హెగ్డేకు(Pooja Hegde) ఇప్పుడో క్రేజీ బంపరాఫర్‌ వచ్చింది. కొన్నాళ్ల కిందటి వరకు పూజా హెగ్డేకు బ్రహ్మండమైన క్రేజ్‌ ఉండేది. వరుస హిట్లతో అగ్రశ్రేణి కథానాయిక అయ్యింది. తెలుగువారు ఆమెను అక్కున చేర్చుకున్నారు. ఏమైందో ఏమో కానీ తర్వాత వరుసగా సినిమాలు దెబ్బతినడం మొదలయ్యింది.

బుట్టబొమ్మకు కాలం కలిసి వస్తోంది. తంతే బూరలబుట్టలో పడినట్టయింది. వరుస ఫ్లాపులతో నిరాశ నిస్పృహలతో ఉన్న పూజా హెగ్డేకు(Pooja Hegde) ఇప్పుడో క్రేజీ బంపరాఫర్‌ వచ్చింది. కొన్నాళ్ల కిందటి వరకు పూజా హెగ్డేకు బ్రహ్మండమైన క్రేజ్‌ ఉండేది. వరుస హిట్లతో అగ్రశ్రేణి కథానాయిక అయ్యింది. తెలుగువారు ఆమెను అక్కున చేర్చుకున్నారు. ఏమైందో ఏమో కానీ తర్వాత వరుసగా సినిమాలు దెబ్బతినడం మొదలయ్యింది. దాంతో ఆమె బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంది. అక్కడా సేమ్‌ సీన్‌ రిపీట్ అయ్యింది. తమిళంలో కూడా అదే పరిస్థితి. దీంతో ఆమె కెరీర్‌ ముగిసినట్టేనని అందరూ భావించారు. ఇలాంటి సమయంలో ఆమెకు ఉత్సాహం కలిగించే ఆఫర్‌ వచ్చింది. తమిళంలో హీరో సూర్య(Suriya) ఇప్పుడు కంగువ(Kanguva) సినిమా చేస్తున్నాడు. ఈ ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. మరోవైపు తన 44వ సినిమా కూడా రెడీ చేస్తున్నాడు. దీనికి కార్తీక్‌ సుబ్బరాజ్‌(Karthik Subbaraj) దర్శకత్వం వహిస్తున్నాడు. సూర్య సొంత నిర్మాణ సంస్థ అయిన 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కార్తీక్‌ సుబ్బరాజ్‌ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్‌ ఛాన్స్‌ పూజా హెగ్డేకు వచ్చింది. పదకొండేళ్ల క్రితం మాస్క్(Mask) సినిమాతో తమిళంలో అడుడుపెట్టిన పూజా హెగ్డే దళపతి విజయ్‌తో(Thalapthy Vijay) బీస్ట్‌(Beast) సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఆశించిన మేర విజయం సాధించలేదు. దాంతో తమిళంలో అవకాశాలు రాలేదు. ఇప్పడు సూర్య సినిమాలో అవకాశం అంటే బంపరాఫర్‌ కొట్టినట్టే! ఇది విజయవంతం అయితే మాత్రం పూజా హెగ్డేకు మళ్లీ మంచిరోజులు వచ్చినట్టే అవుతుంది.

Updated On 17 May 2024 11:41 PM GMT
Ehatv

Ehatv

Next Story