కాల్‌షీట్లు సర్దుబాటు చేయలేక టాప్ హీరో, హీరోయిన్లు కొన్ని సినిమాలను వదిలేసుకోవాల్సి వస్తుంది. కొన్ని మంచి సినిమాలను వదిలేసుకున్న హీరో, హీరోయిన్లు చాలా మందే ఉంటారు. కొన్ని సందర్భాలలో రకరకాల సమీకరణలతో అవకాశాలు అటూ ఇటూ అవుతుంటాయి. ఒకప్పుడు తెలుగులో బిజీ హీరోయన్ అయిన పూజా హెగ్డే(Pooja Hegde) ఉన్నట్టుండి ఖాళీ అయ్యారు. మహేశ్‌బాబు(Mahesh)- త్రివిక్రమ్(Trivikram) కాంబినేషన్‌లో రాబోతున్న గుంటూరు కారం(Gunturu Karam) సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా ఎంపికయ్యారు.

Pooja Hegde
కాల్‌షీట్లు సర్దుబాటు చేయలేక టాప్ హీరో, హీరోయిన్లు కొన్ని సినిమాలను వదిలేసుకోవాల్సి వస్తుంది. కొన్ని మంచి సినిమాలను వదిలేసుకున్న హీరో, హీరోయిన్లు చాలా మందే ఉంటారు. కొన్ని సందర్భాలలో రకరకాల సమీకరణలతో అవకాశాలు అటూ ఇటూ అవుతుంటాయి. ఒకప్పుడు తెలుగులో బిజీ హీరోయన్ అయిన పూజా హెగ్డే(Pooja Hegde) ఉన్నట్టుండి ఖాళీ అయ్యారు. మహేశ్‌బాబు(Mahesh)- త్రివిక్రమ్(Trivikram) కాంబినేషన్‌లో రాబోతున్న గుంటూరు కారం(Gunturu Karam) సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా ఎంపికయ్యారు. ఏమైందో ఏమో కానీ ఈ మధ్య మార్పులు చేర్పుల కారణంగా ఆమె సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. తెలుగులో ఉన్న ఒకే ఒక్క సినిమా పూజా హెగ్డే చేజారిందని ఆమె ఫ్యాన్స్ బాధపడ్డారు.
కానీ ఆమెను ఇప్పుడు అదృష్టం వరించింది. డబుల్ ధమాకాకి రెడీ అయ్యారు. ఇద్దరు యువ హీరోలు చేస్తున్న సినిమాలలో ఆమెకు హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చింది. దుల్కర్ సల్మాన్(Dulqaar salman), సాయిధరమ్ తేజ్‌ల(Sai Dharam Tej) సినిమాలలో ఆమె కథానాయికగా నటించే అవకాశాలున్నాయి. మరో హీరోయిన్ నభా నటేశ్‌కు(Nabba Natesh) కూడా కొన్నాళ్లుగా తెలుగులో సినిమాలు లేవు. ఆమెకు కూడా రెండు కీలకమైన ప్రాజెక్టులు లభించాయి. బెల్లంకొండ శ్రీనివాస్(Bellam konda Srinivas) హీరోగా సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నభా నటేష్‌ను హీరోయిన్‌గా తీసుకోవాలని మేకర్స్ అనుకుంటున్నారు. నాగశౌర్యతోనూ(Nagashourya) నభా నటేష్ ఓ సినిమా కోసం జత కట్టబోతున్నారు. అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగితే ఈ ఇద్దరు హీరోయిన్లు డబుల్ ధమాకాతో సందడి చేయడం ఖాయం అని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
