రెండేళ్ల కిందటి వరకు పూజా హెగ్డే(Pooja Hegde) అగ్రతారగా వెలుగొందింది. ఆమెది బంగారుపాదమంటూ కీర్తించారు. ఆమె చేసిన అన్ని సినిమాలు హిట్టు మీద హిట్టు కొట్టాయి. మేకర్స్‌ పాలిటి లక్కీ హీరోయిన్‌(Lucky Heroine) అయ్యారు. దశాబ్దం కిందట తమిళంలో ముఖముడి(Mukhamudi) అనే సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన పూజా హెగ్డేకు తొలి చిత్రమే నిరాశపర్చింది. ఆ చిత్రం సరిగ్గా ఆడకపోవడంతో అక్కడ ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. తర్వాత ఆమె తెలుగు సినీ పరిశ్రమలోకి వచ్చింది.

రెండేళ్ల కిందటి వరకు పూజా హెగ్డే(Pooja Hegde) అగ్రతారగా వెలుగొందింది. ఆమెది బంగారుపాదమంటూ కీర్తించారు. ఆమె చేసిన అన్ని సినిమాలు హిట్టు మీద హిట్టు కొట్టాయి. మేకర్స్‌ పాలిటి లక్కీ హీరోయిన్‌(Lucky Heroine) అయ్యారు. దశాబ్దం కిందట తమిళంలో ముఖముడి(Mukhamudi) అనే సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన పూజా హెగ్డేకు తొలి చిత్రమే నిరాశపర్చింది. ఆ చిత్రం సరిగ్గా ఆడకపోవడంతో అక్కడ ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. తర్వాత ఆమె తెలుగు సినీ పరిశ్రమలోకి వచ్చింది. తెలుగువారు ఆమెను ఆదరించారు. ఆమె నటించిన మహర్షి, అల వైకుంఠపురంలో వంటి సినిమాలు సూపర్‌ డూపర్‌ హిట్‌ కావడంతో ఒక్కసారిగా ఆమె స్టార్‌ హీరోయిన్‌ అయ్యింది. ఆ తర్వాత నుంచి ఆమెకు బ్యాడ్‌ పిరియడ్ మొదలయ్యింది. ఆమె నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్‌ కావడంతో ఆమెకు అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం తెలుగులో ఆమెకు ఒక్క సినిమా కూడా లేదు. ఇటీవలి కాలంలో ఆమె నటించిన తమిళం, హిందీ సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో పూజా హెగ్డేకు తమిళ పరిశ్రమ మరో లక్కీ ఛాన్స్‌ ఇవ్వబోతున్నది. భారతీయ చలనచిత్ర చరిత్రలో ఏవీఎం చిత్ర నిర్మాణ(AVM Production House) సంస్థకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ సంస్థకు సుదీర్ఘమైన చరిత్ర కూడా ఉంది. బ్లాక్‌ అండ్ వైట్ కాలం నుంచి ఆ సంస్థ అనేక విజయవంతమైన సినిమాలను నిర్మించింది. అగ్ర హీరోలందరితో సినిమాలు తీసింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ వంటి పలు భాషలలో సినిమా నిర్మించింది. ఎవీఎం సంస్థలో చిత్రాలు చేయడానికి నటీనటులు, దర్శకులు, సాంకేతిక వర్గం కలలు కంటుంటారు. అలాంటి ఈ సంస్థ ఇటీవలి కాలంలో చిత్ర నిర్మాణానికి దూరంగా ఉంటూ వచ్చింది. లేటెస్ట్‌గా మళ్లీ చిత్ర నిర్మాణం చేపట్టడానికి రెడీ అవుతోంది. ఈ సంస్థ ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ కోసం సినిమా నిర్మించబోతున్నది. ఈ సినిమాకు డిమాంటి కాలనీ, ఇమైకా నొడిగల్‌ చిత్రాల దర్శకుడు అజయ్‌ జ్ఞానముత్తు(Ajay Gnanamuttu) దర్శకత్వం వహిస్తున్నారు. ఇది లేడీ ఓరియంటెడ్‌ సినిమా అని, ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించనుందని తెలిసింది.

Updated On 23 Dec 2023 3:50 AM GMT
Ehatv

Ehatv

Next Story