ఒక్క సినిమా ఫ్లాప్‌ అయితేనే ఆఫర్లు తగ్గడం మొదలవుతాయి. అలాంటిది వరుసగా ఫ్లాపులు వస్తే ఇంకేమైనా ఉందా? నిర్మాతలు ఆ ఆర్టిస్టు ఛాయల్లోకి కూడా రారు! అదేమిటో పూజా హెగ్డే (pooja hegde) మాత్రం హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా దూసుకుపోతోంది. బుట్టబొమ్మగా పాపులరైన ఈమె ప్రస్తుతం బిజీ ఆర్టిస్టులలో ఒకరు. మొన్ననే సల్మాన్‌ఖాన్‌తో(salman khan)కలిసి నటించిన కిసీ కా భాయ్‌.. కిసీ కీ జాన్‌ (kisika bhai kisiki jaan) సినిమా రిలీజ్‌ అయ్యింది.

ఒక్క సినిమా ఫ్లాప్‌ అయితేనే ఆఫర్లు తగ్గడం మొదలవుతాయి. అలాంటిది వరుసగా ఫ్లాపులు వస్తే ఇంకేమైనా ఉందా? నిర్మాతలు ఆ ఆర్టిస్టు ఛాయల్లోకి కూడా రారు! అదేమిటో పూజా హెగ్డే (pooja hegde) మాత్రం హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా దూసుకుపోతోంది. బుట్టబొమ్మగా పాపులరైన ఈమె ప్రస్తుతం బిజీ ఆర్టిస్టులలో ఒకరు. మొన్ననే సల్మాన్‌ఖాన్‌తో(salman khan)కలిసి నటించిన కిసీ కా భాయ్‌.. కిసీ కీ జాన్‌ (kisika bhai kisiki jaan) సినిమా రిలీజ్‌ అయ్యింది. సినిమా హిట్‌టాక్‌ను సొంతం చేసుకోలేకపోయింది. అలాగని అట్టర్‌ ఫ్లాప్‌ కూడా కాదు. ఈ సినిమాతోనైనా వరుస ఫ్లాప్‌లకు పుల్‌స్టాప్‌ పెట్టాలనుకుంది పూజా! కానీ అది నెరవేరలేదు. ఇప్పుడు పూజా హెగ్డేకు ఫ్లాప్‌ హీరోయిన్‌ అన్న పేరు వచ్చేసింది. అల్లు అర్జున్‌ నటించిన దువ్వాడ జగన్నాథం (DJ)సినిమాతో ఆమె తొలి హిట్ కొట్టింది. ఆ తర్వాత మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ పూజాను నిలదొక్కుకునేలా చేసింది. ఆ తర్వాత ఎన్టీఆర్‌(ntr), మహేశ్‌బాబులతో (Maheshbabu)నటించి అగ్ర కథనాయికగా మారింది. వరుస హిట్లతో మార్కెట్‌ను పెంచుకుంది. కానీ 2022 నుంచి ఆమెకు కాలం కలిసి రావడం లేదు. ఆమె నటించిన పాన్‌ ఇండియా సినిమాలు రాధేశ్యామ్‌(radheshyam), బీస్ట్‌, ఆచార్య(aacharya) సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి. బాలీవుడ్‌లో చేసిన భారీ బడ్జెట్‌ సినిమా సర్కస్‌ కూడా పోయింది. దీంతో ఆమెకు ఐరెన్‌ లెగ్‌ అన్న పేరు వచ్చేసింది. పోనీ ఈ ఏడాదిలోనైనా ఆమెకు హిట్‌ తగులుతుందనుకుంటే అదీ కాలేదు. కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌ కూడా సో సోగా ఆడుతోంది. ఇప్పుడామె ఆశలన్నీ త్రివిక్రమ్‌ (trivikram) డైరెక్షన్‌లో మహేశ్‌బాబు నటిస్తున్న ఎస్‌ఎస్‌ఎంబీ 28పైనే ఉన్నాయి.. ఈ సినిమాతోనైనా ఆమె పూర్వవైభవాన్ని సంతరించుకుంటుందేమో చూడాలి.!

Updated On 25 April 2023 5:39 AM GMT
Ehatv

Ehatv

Next Story