రెండేళ్ల కిందటి వరకు పూజా హెగ్డే(Pooja Hegde) టాలీవుడ్‌లో టాప్‌ స్టార్‌. ఆమె నటించిన సినిమాలన్నీ హిట్టయ్యాయి.

రెండేళ్ల కిందటి వరకు పూజా హెగ్డే(Pooja Hegde) టాలీవుడ్‌లో టాప్‌ స్టార్‌. ఆమె నటించిన సినిమాలన్నీ హిట్టయ్యాయి. అల వైకుంఠపురిలో సినిమా వరకు ఆమె క్రేజ్‌ నడిచింది. తర్వాత నెమ్మదిగా ఆమె ఫేడ్‌ అవుటయ్యింది. అవకాశాలు తగ్గాయి. గుంటూరుకారంలో అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారింది. ఇందుకు కారణం కూడా ఉంది. పూజా హెగ్డే తెలుగు సినిమాలను వదిలేసి హిందీ సినిమాల కోసం బాలీవుడ్‌కు వెళ్లడమే! అక్కడ సక్సెసయ్యిందా అంటే అదీ లేదు. ఇప్పుడు ఆమెకు మళ్లీ మంచి రోజులు వచ్చినట్టుగా ఉన్నాయి. సూర్య హీరోగా రూపొందుతున్న ఓ తమిళ సినిమాలో హీరోయిన్‌ ఛాన్స్‌ కొట్టేసింది పూజా. ఇటీవలే ఓ హిందీ సినిమాలో అవకాశం వచ్చింది. తెలుగు నిర్మాత,దర్శకులు ఆమె వంక చూడకపోయినా ఇతర భాషల్లో మాత్రం అవకాశాలు బాగానే వస్తున్నాయి. తెలుగులో అవకాశాల కోసమేమో ఇటీవల అభిమానులతో జరిపిన చిట్‌చాట్‌లో తెలుగు సినిమాపై అమితమైన ప్రేమను ఒలకబోసింది. అన్ని భాషల్లో నటిస్తున్నారు కదా.. నటిగా మీ ప్రయారిటీ ఏ భాషకు ఇస్తారు? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు.. 'నటనకు ప్రాంతీయబేధం లేదు. ఏ భాషలోనైనా నాకు కంఫర్ట్‌గానే ఉంటుంది. అయితే.. తెలుగు సినిమా నాకు ప్రత్యేకం. ఎందుకంటే.. నాకంటూ ఓ గుర్తింపును ఇచ్చింది తెలుగు సినిమానే. నేను ఎన్ని భాషల్లో నటించినా.. తెలుగులో అవకాశం వస్తే మాత్రం కాస్త ఎక్కువ ఆనందిస్తా. త్వరలో తెలుగులో ఓ మంచి సినిమా చేస్తా.’ అంటూ పూజా హెగ్డే చెప్పుకొచ్చింది.

Eha Tv

Eha Tv

Next Story