పూజా హెగ్డే(Pooja Hegde) నటించిన 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' చిత్రం మరికొద్ది రోజుల్లో థియేటర్లలోకి రానుంది. సల్మాన్ ఖాన్(Salman Khan) సరసన ఆమెను తెరపై చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. సినిమా విడుద‌ల తేదీ దగ్గర పడుతుండడంతో పూజా హెగ్డేపై కొత్త వివాదాలు కూడా పుట్టుకొస్తున్నాయి.

పూజా హెగ్డే(Pooja Hegde) నటించిన 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' చిత్రం మరికొద్ది రోజుల్లో థియేటర్లలోకి రానుంది. సల్మాన్ ఖాన్(Salman Khan) సరసన ఆమెను తెరపై చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. సినిమా విడుద‌ల తేదీ దగ్గర పడుతుండడంతో పూజా హెగ్డేపై కొత్త వివాదాలు కూడా పుట్టుకొస్తున్నాయి. రోజూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. పూజా హెగ్డే, సల్మాన్ ఖాన్ డేటింగ్ చేస్తున్నారనే ప్రచారం ఇటీవల జరిగింది. పూజా ఈ పుకార్లను ఖండించింది. ప్రస్తుతం తాను ఒంటరిగా ఉన్నానని.. తన దృష్టి తన కెరీర్‌పై మాత్రమే ఉందని స్పష్టం చేసింది. ఈ రూమర్ ఓ కొలిక్కి రాగానే నటి గురించిన మరో వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

ఓ పోర్టల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. నిర్మాత మీకు కారు బహుమతిగా ఇచ్చారా అని అడ‌గ్గా పూజా హెగ్డే బదులిచ్చారు. తన గురించి రోజుకో కొత్త వార్త ప్రచురితమవుతోందని అన్నారు. ప్రజలందరికీ నేను సమాధానం చెప్పలేను. వచ్చే ప్రతి రూమర్‌(Rumour)కి సమాధానం చెప్పలేనని కోపంగా బదులిచ్చింది. ఈ వార్త తెలియగానే స్క్రీన్‌షాట్‌ను నిర్మాతకు పంపి.. ‘బద్నాం చేస్తున్నారా.. కారు ఇవ్వండి’ అని అడిగాన‌ని చెప్పింది.

గతంలో సల్మాన్ ఖాన్‌తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. పూజా సోదరుడు రిషబ్ హెగ్డే(Rishab Hegde) సోదరుడి వివాహానికి సల్మాన్ హాజరుకావడంతో ఈ పుకార్లకు ఆజ్యం పోసిన‌ట్టైంది. అయితే.. పూజా ఈ వార్త‌ల‌కు ఖండించింది. అవ‌న్నీ రూమ‌ర్ల‌ని పేర్కొంది.

Updated On 16 April 2023 4:50 AM GMT
Yagnik

Yagnik

Next Story