సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు(mahesh babu) హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌(trivikram) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం గుంటూరు కారం(gunturu karam). ఈ సినిమాలో పూజా హెగ్డే(pooja hegde), శ్రీలీల(sreeleela) హీరోయిన్లుగా నటిస్తున్నారని చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ఏమైందో ఏమో కానీ ఈ సినిమాలో పూజా హెగ్డే నటించే అవకాశం లేదనే వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు(mahesh babu) హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌(trivikram) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం గుంటూరు కారం(gunturu karam). ఈ సినిమాలో పూజా హెగ్డే(pooja hegde), శ్రీలీల(sreeleela) హీరోయిన్లుగా నటిస్తున్నారని చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ఏమైందో ఏమో కానీ ఈ సినిమాలో పూజా హెగ్డే నటించే అవకాశం లేదనే వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కాల్షీట్లు అడ్జెస్ట్‌ చేయడం కుదరడం లేదని, అందుకే పూజా ఈ సినిమాలోంచి తప్పుకున్నారని టాక్‌ వినిపించింది.

పూజా హెగ్డే ప్లేస్‌లో మరో హీరోయిన్‌ను ఎంపిక చేయబోతున్నారంటూ పలు వెబ్‌సైట్లలో కథనాలు వచ్చాయి. సెకండ్‌ హీరోయిన్‌గా తీసుకున్న శ్రీలీలకు ప్రధాన పాత్ర ఇచ్చేసి, ఆమె స్థానంలో మరో నటిని ఎంపిక చేయబోతున్నట్టు కూడా కొందరు రాశారు. ఇప్పుడు ఆ పేరు బయటకు వచ్చింది. మీనాక్షి చౌదరిని(meenakshi chaudhary) హీరోయిన్‌గా తీసుకునేందుకు గుంటూరు కారం సినిమా బృందం ఆసక్తి చూపుతున్నదట! ముందుగా సెకండ్‌ హీరోయిన్‌గా తీసుకున్న శ్రీలీలను ఇప్పుడు ప్రధాన నాయికగా మార్చి మీనాక్షి చౌదరిని రెండో హీరోయిన్‌గా తీసుకోబోతున్నారట.

మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు. చిత్ర యూనిట్‌ నుంచి అధికార ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు ఈ సినిమా సంగీత దర్శకుడి విషయంలోనూ ఇటీవల పలు రూమర్లు వచ్చాయి. థమన్‌ స్ఠానంలో మరో మ్యూజిక్‌ డైరెక్టర్‌ను తీసుకున్నారని సోషల్‌ మీడియా కోడై కూసింది. దీనిపై నిర్మాత నాగవంశీ(Nagavamsi) స్పందించారు. అవన్నీ వదంతులే తప్ప నిజం కాదని తెలిపారు. అలాంటి రూమర్లను పుట్టించే వారిపై థమన్‌ తనదైన స్టయిల్లో కౌంటర్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే! ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు మీనాక్షి చౌదరి.

మొదటి సినిమాతోనే చాలా మందిని ఆకట్టుకున్నారు. ఆ తర్వాత హిట్‌-2, ఖిలాడి సినిమాల్లో సందడి చేశారు. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేశ్‌బాబు-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం గుంటూరు కారం. అందుకే ఈ సినిమా ప్రకటన వెలువడిన నిమిషం నుంచే సినిమా అభిమానుల్లో అంచనాలు మొదలయ్యాయి. ఇచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమాను జనవరి 13న విడుదల చేస్తున్నారు.

Updated On 24 Jun 2023 12:07 AM GMT
Ehatv

Ehatv

Next Story