పాపం పూజా హెగ్డే(Pooja Hegde) చాలా కాలంగా హిట్ సినిమా చూసింది లేదు. టాలీవుడ్ లో హిట్ రావడంలేదు అనుకుంటే.. తమిళంలో కూడా అదే పరిస్థితి. ఇక బాలీవుడ్ లో అయినా గట్టిగా ప్రయత్నం చేద్దాం అంటే..అక్కడ కూడా వరుసగా ప్లాప్ లు పలకరించాయి. దాంతో ఎటూ తోచని పరిస్థితుల్లో పడిపోయింది బ్యూటీ. అయితే ఐరన్ లెగ్ అంటూ పేరు పడ్డా కాని.. అవకాశాల విషయయంలో మాత్రం ఆమెను అదృష్టం వరిస్తూనే ఉంది.

వరుస ఫ్లాపులు పడినప్పటికీ పూజ హెగ్డేకి ఉన్న క్రేజ్ గానీ .. మార్కెట్ గాని ఏమాత్రం తగ్గలేదు. పూజాన్ వెతుక్కుంటూ అవకాశా గుమ్మంముదుకు వచ్చి తలుపు తడుతున్నాయి. . పాన్ ఇండియా స్థాయి ఫ్లాపులు పడినప్పటికీ, ఆమె కూడా ఏమాత్రం కుంగిపోకుండా.. ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అంతే కాదు వచ్చిన అవకాశాలలో మంచివి సెలక్ట్ చేసుకుని వరుసగా సైన్లు చేస్తోంది బ్యూటీ. అలా ముందుకు వెళుతోంది.

ప్రస్తుతం తెలుగులో మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ రూపొందిస్తున్న గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ గా సందడి చేయబోతోంది బ్యూటీ. ఇంకొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక తమిళంలో పూజాకు ఆఫర్లు గట్టిగానే వస్తున్నాయట కాని ఆమె ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో తమిళంలో కూడా ఆమె ఒక భారీ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు .. ఆ సినిమాలో కార్తి హీరోగా నటించబోతున్నట్టు సమాచారం. .

గతంలో కార్తి హీరోగా వచ్చిన 'ఆవారా' తమిళంతో పాటు తెలుగులోను హిట్ టాక్ తెచ్చుకుంది. 2010లో వచ్చిన ఆ సినిమాకి సీక్వెల్ చేయడానికి లింగుస్వామి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమా కోసం ఆయన పూజ హెగ్డేను సంప్రదించినట్టుగా తెలుస్తోంది. కార్తి నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడం పక్కానే. అంతా అనుకున్నట్టుగా జరిగితే 'బీస్ట్' తరువాత పూజ హెగ్డే చేసే సినిమా ఇదే అవుతుందని చెప్పచ్చు.

Updated On 9 Jun 2023 1:13 AM GMT
Ehatv

Ehatv

Next Story