టాలీవుడ్‌లో ప్రస్తుతం అగ్ర కథానాయిక ఎవరు అంటే టక్కున చెప్పే సమాధానం పూజా హెగ్డే(Pooja Hegde). ఎందుకంటే ఈమె నటించిన సినిమాలలో మాగ్జిమమ్ హిట్సే కావడం. అగ్రహీరోలందరి సరసన నటించిన ఈ అందాల భామ ఇప్పుడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)తో కలిసి నటించబోతున్నారు. దర్శకుడు పరశురామ్ పెట్ల రూపొందించబోతున్న కొత్త సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డెనే ఎంచుకున్నారట.

Pooja Hegde Acting with Vijay Devarakonda
టాలీవుడ్‌లో ప్రస్తుతం అగ్ర కథానాయిక ఎవరు అంటే టక్కున చెప్పే సమాధానం పూజా హెగ్డే(Pooja Hegde). ఎందుకంటే ఈమె నటించిన సినిమాలలో మాగ్జిమమ్ హిట్సే కావడం. అగ్రహీరోలందరి సరసన నటించిన ఈ అందాల భామ ఇప్పుడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)తో కలిసి నటించబోతున్నారు. దర్శకుడు పరశురామ్ పెట్ల రూపొందించబోతున్న కొత్త సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డెనే ఎంచుకున్నారట. గతంలో విజయ్ దేవరకొండతో పరశురామ్ రూపొందిన గీత గోవిందం ఎంత పెద్ద హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విజయ్ దేవరకొండ కెరీర్‌కు గట్టి పునాది పడింది కూడా ఆ సినిమాతోనే. విజయ్‌తో తీస్తున్న కొత్త సినిమాలోని క్యారెక్టర్‌కు పూజా హెగ్డే అయితే బాగుంటుందని దర్శకుడు పరశురామ్ భావిస్తున్నారట. దీనితో పాటు ఈ కథకు ఇప్పటి వరకు కలిసి నటించని జంట కావాలన్నది దర్శకుడి ఆలోచన అట! నిజానికి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ జనగణమన అనే సినిమాలో నటించాల్సి ఉండింది. ఇందులో పూజా హెడ్గేనే హీరోయిన్‌గా తీసుకున్నారు కూడా. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా సెట్స్‌కు వెళ్లక ముందే ఆగిపోయింది. దాంతో పూజా, విజయ్ జోడీని చూద్దామనుకున్న ప్రేక్షకుల కోరిక నెరవేరలేదు. ఇప్పుడు ఈ కొత్త చిత్రంతో వీరి జంట కుదిరింది. అన్నట్టు ఈ సినిమా గీత గోవిందం చిత్రానికి సీక్వెలా, లేకపోతే కొత్త కథనా అన్నది తెలియాలి. ప్రస్తుతం గంటూరు కారం అనే సినిమాలో మహేశ్‌బాబు సరసన పూజా హెగ్డే నటిస్తున్నారు.
