దర్శకుడు మహేశ్‌భట్‌(Mahesh Bhatt) కూతురు పూజాభట్‌(Pooja bhatt) గత స్మృతులను ఓసారి నెమరేసుకున్నారు. తండ్రితో కలిసి గతంలో ఓ వైరల్‌ ఫోటో షూట్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇందులో వీరిద్దరూ ముద్దు పెట్టుకుంటూ ఫోటోలకు పోజులిచ్చారు. దీనిపై అప్పట్లో పెద్ద వివాదం రేగింది. చాలా మంది తీవ్రంగా విమర్శించారు.

దర్శకుడు మహేశ్‌భట్‌(Mahesh Bhatt) కూతురు పూజాభట్‌(Pooja bhatt) గత స్మృతులను ఓసారి నెమరేసుకున్నారు. తండ్రితో కలిసి గతంలో ఓ వైరల్‌ ఫోటో షూట్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇందులో వీరిద్దరూ ముద్దు పెట్టుకుంటూ ఫోటోలకు పోజులిచ్చారు. దీనిపై అప్పట్లో పెద్ద వివాదం రేగింది. చాలా మంది తీవ్రంగా విమర్శించారు. అభ్యంతరం చెప్పారు. తండ్రి కూతుళ్లను తప్పుబట్టారు. సుమారు 33 ఏళ్ల కిందట జరిగిన ఆ ఫోటో షూట్‌ గురించి, అప్పుడు ఎదురైన ఇబ్బందుల గురించి ఇన్నేళ్ల తర్వాత పూజా భట్‌ మొదటిసారి స్పందించారు. ఆ షూట్‌లో పాల్గొన్నందుకు తాను ఏ మాత్రం బాధపడటం లేదని చెప్పారు.

తమ ఉద్దేశం మంచిదేనని, కాకపోతే చూసేవారే దృష్టే వేరుగా ఉందని, వారే దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని పూజాభట్‌ తెలిపారు. 'అది చాలా మామూలు విషయం. ఆ ఫొటోలను కొంతమంది మరోలా అర్థం చేసుకోవడం దురదృష్టకరం. ఫొటోషూట్‌పై విమర్శలు వెల్లువెత్తిన సమయంలో షారుక్‌ ఖాన్‌(Shahrukh Khan) చెప్పిన మాటలు నాకింకా గుర్తున్నాయి. పిల్లలు చిన్నప్పుడు తమ తల్లిదండ్రులను ఇలాగే ముద్దుపెట్టుకుంటారు. పిల్లలు ఎంత ఎదిగినా తల్లిదండ్రులు వాళ్లను చిన్నవాళ్లగానే చూస్తారని ఆయన నాతో అన్నారు.

నిజం చెప్పాలంటే, ఈ వయసులోనూ నా తండ్రి నన్ను ఒక చిన్న పాపలానే చూస్తారు' అని పూజా భట్‌ వివరణ ఇచ్చుకున్నారు. 'నిజానికి ఈ ఫొటోషూట్‌ జరిగినప్పుడు సమాజం గురించి నాకు పెద్దగా ఆలోచన లేదు. విషయం ఏదైనా సరే ప్రజలు తమకు నచ్చిన విధంగా చూస్తుంటారు. ఒక తండ్రి కూతుళ్ల మధ్య అనుబంధాన్ని వేరేలా చూడాలనుకుంటే వాళ్లు ఏదైనా ఊహించుకుంటారు. విమర్శనాత్మకమైన వ్యాఖ్యలు చేస్తారు.

చిత్రమేమిటంటే అలాంటి వాళ్లే మళ్లీ కుటుంబ విలువల గురించి లెక్చర్లివ్వడం. ఇంతకంటే పెద్ద జోక్‌ మరోటి ఉండదు' అని పూజా పేర్కొన్నారు. 17 ఏళ్లకే సినిమా రంగంలో అడుగుపెట్టారు పూజా భట్‌. సడక్‌, దిల్‌ హైకీ మాంతా నహీ, డాడీ చిత్రాలతో 19 ఏళ్లకే స్టార్‌ అయ్యారు. అనేక ప్రేమకథా చిత్రాలలో నటించారు. ఎందుకో తెలియదు కానీ 24 ఏళ్లకే కెరీర్‌కు గుడ్‌బై చెప్పారు. ఇప్పుడామె నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అప్పుడప్పుడు సహాయ పాత్రలు వేస్తున్నారు. సడక్‌ 2, బాంబే బేగమ్స్‌, చుప్‌ సినిమాల్లో పూజాభట్‌ కీలక పాత్రలు పోషించారు.

Updated On 12 Sep 2023 12:58 AM GMT
Ehatv

Ehatv

Next Story