దాదాపు రెండు దశాబ్ధాలుగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలేస్తోంది అందాల భామ.. చెన్నై చిన్నది త్రిష(Trisha). మధ్యలో అందరు హీరోయిన్ల మదిరి ఫెయిడ్ అవుట్ అయినా.. తాజాగా మరోసారి సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసింది బ్యూటీ. ఈసారి ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగానో కాకుండా.. హీరోయిన్ గా మరోసారి స్టార్ హీరోల సరసన మెరుస్తోంది.

ఇక అందం విషయంలో ఫిట్ నెస్ విషయంలో అందరికి షాక్ ఇస్తోంది త్రిష. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే బ్యూటీనీమెయింటేన్ చేస్తోంది. అందుకే విజయ్(Vijay) తో సినిమా చేస్తున్న భామ.,. అజిత్(Ajith) తో కూడా మూవీ కన్ఫర్మ్ చేసుకుంది. ఇప్పటిక ఓ సారి ఎంగేజ్ మెంట్ వరకూ వచ్చి త్రిష పెళ్ళి ఆగిపోయింది. ఇక తాజాగా మరోసారి ఈ బ్యూటీ పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి.

సినీ పరిశ్రమలో త్రిష అడుగుపెట్టి 21 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. వన్నె తగ్గని అందంతో ప్రేక్షకులను ఇప్పటికీ ఆమె కట్టిపడేస్తోంది. హీరోయిన్ గా ఇప్పటికీ తన సత్తాను చాటుతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయంటే త్రిష డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు త్రిష గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఓ మలయాళ నిర్మాతను(Producer) త్రిష పెళ్లాడబోతోందనేదే ఆ వార్త. గతంలో ఓ సినిమా సందర్భంగా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని సమాచారం. త్వరలోనే వీరిద్దరూ పెళ్లిపీటలు ఎక్కబోతున్నారని చెపుతున్నారు. ఈ వార్తలు ఎంత వరకు నిజమనేది వేచి చూడాలి. మరోవైపు గతంలో త్రిషకు ఓ వ్యాపారవేత్తతో ఎంగేజ్ మెంట్ జరిగింది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వారి బంధం పెళ్లి వరకు వెళ్లలేకపోయింది.

తెలుగులో వర్షం చిత్రంతో త్రిష హవా మొదలైంది. స్టార్ హీరోలందరితో ఆడి పాడింది. తన అందం, చిలిపితనంతో త్రిష చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలని తన ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ. ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా త్రిష విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.

Updated On 20 Sep 2023 4:04 AM GMT
Ehatv

Ehatv

Next Story