అల్లు అర్జున్(Allu Arjun)-సుకుమార్(Sukumar) కాంబోలో రూపుదిద్దుకున్న పుష్ప 2(Pushpa-2) సినిమా మరో పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.
అల్లు అర్జున్(Allu Arjun)-సుకుమార్(Sukumar) కాంబోలో రూపుదిద్దుకున్న పుష్ప 2(Pushpa-2) సినిమా మరో పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఫాన్స్ చాలా ఈగర్‌గా సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. అదేమిటో కానీ ఈ సినిమాపై బలవంతంగా రాజకీయ రంగును పులపుతున్నట్టుగా అనిపిస్తోంది. దీన్ని మొదలు పెట్టింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్(YCP) పార్టీనే! కొంతమంది వైసీపీ నేతలు అనవసరంగా పుష్ప 2 సినిమాపై కామెంట్లు చేస్తున్నారు. నిజానికి అల్లు అర్జున్‌కు ఏ పొలిటికల్ పార్టీతో సంబంధం లేదు. న్యూట్రల్‌గానే ఉంటాడు. అందరినీ అభిమానిస్తాడు. శిల్ప(shilpa) తన ఫ్రెండ్ కాబట్టి ఎన్నికల ప్రచారానికి నంద్యాల వెళ్లాడంతే! అంతే తప్ప ఏనాడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు మద్దతుగా మాట్లాడలేదు. అలాగని వేరే పార్టీల సైడు తీసుకున్నాడా అంటే అదీ లేదు. కాకపోతే ప్రచారం కోసం నంద్యాలకు(nandhyala) వెళ్లి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో బన్నీని పనిగట్టుకుని ట్రోల్ చేశారు. ఫలితాలు వచ్చిన తర్వాత చాలా ఎక్కువ చేశారు. మెగా కాంపౌండ్‌కు అల్లు అర్జున్ దూరమయ్యారనే వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు వైసీపీ నేతలు పుష్ప 2 గురించి మాట్లాడుతుండటం సహజంగానే కూటమి నేతలకు కోపం తెప్పిస్తుంది. తెలుగుదేశం(TDP), జనసేన పార్టీలకు(Janasena) చెందిన సోషల్ మీడియా ఆల్‌రెడీ పుష్ప 2పై ట్రోల్స్ చేయడం మొదలు పెట్టాయి. సినిమా విడుదల నాటికి సోషల్ మీడియాలో పెద్ద వారే జరగవచ్చనిపిస్తోంది..