ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ షో అంటే పడి చచ్చిపోతారు మ్యూజిక్ లవర్స్. ఆయన స్టేజ్ మీద ఉన్నాడంటే.. ఆడియన్స్ కు పండగే.. మ్యూజిక్ షోకోసం లక్షలు పోసి టికెట్లు కొనేవారు కూడా లేకపోలేదు. అంత ఇష్టం ఆయనంటే. రెహమాన్ కూడా ఫ్యాన్స్ ఊపు చూసి.. ఇంకా రెచ్చిపోతారు. తన ఎవర్గ్రీన్ ట్యూన్స్ తో రచ్చ రచ్చ చేస్తారు. అటు ఆడియన్స్ కాళ్లు..నేలపై నిలువనీయకుండా.. పూనకాలతో ఊగిపోవల్సిందే. కరెక్ట్ గా అదే టైమ్ లో షోకి బ్రేక్ పడితే..? సరిగ్గా అదే జరిగింది రీసెంట్ గా

ఏఆర్ రెహమాన్ లైవ్ షో అంటే ఎంత జోరుగా సాగుతుంటుందో తెలిసిందే.. మ్యూజిక్ లవర్స్ ప్రపంచాన్ని మర్చిపోయి ఎంజాయ్ చేస్తుంటారు. సరిగ్గా అదే టైమ్ లో షోకి బ్రేక్ పడితే..?

ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ షో అంటే పడి చచ్చిపోతారు మ్యూజిక్ లవర్స్. ఆయన స్టేజ్ మీద ఉన్నాడంటే.. ఆడియన్స్ కు పండగే.. మ్యూజిక్ షోకోసం లక్షలు పోసి టికెట్లు కొనేవారు కూడా లేకపోలేదు. అంత ఇష్టం ఆయనంటే. రెహమాన్ కూడా ఫ్యాన్స్ ఊపు చూసి.. ఇంకా రెచ్చిపోతారు. తన ఎవర్గ్రీన్ ట్యూన్స్ తో రచ్చ రచ్చ చేస్తారు. అటు ఆడియన్స్ కాళ్లు..నేలపై నిలువనీయకుండా.. పూనకాలతో ఊగిపోవల్సిందే. కరెక్ట్ గా అదే టైమ్ లో షోకి బ్రేక్ పడితే..? సరిగ్గా అదే జరిగింది రీసెంట్ గా

ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్.. స్వర సంచలనం ఏఆర్ రెహ్మాన్‌ లైవ్ షో తాజాగా పుణెలో నిర్వ‌హించారు. అయితే ఈ షోను మధ్యలోనే పూణే పోలీసులు అడ్డుకున్నారు. రాత్రి 10 దాటిన త‌ర్వాత డెడ్‌లైన్ ముగిసింద‌ని, షోను ఆపేయాల‌ని పోలీసులు రెహమాన్ టీంను కోరారు. దీంతో ఆ లైవ్ క‌న్స‌ర్ట్‌ను నిలిపివేయక తప్పలేదు. డైరెక్ట్ గా డయాస్ మీదకు వచ్చిన ఓ పోలీసు.. షోను ఆపాలంటూ రెహమాన్‌ను అడుగుతున్న వీడియో ఒక‌టి ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది.

ఆదివారం రాత్రి ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. మెట్రో నగరాల్లో ముఖ్యంగా పూణేలో లైవ్ షోలకు రాత్రి ప‌ది గంట‌లవరకే పర్మీషన్ ఇస్తారు. టైమ్ దాటిపోతే..అది ఎంత పెద్ద షె అయినా సరే మధ్యలోనే నిలిపివేస్తారు. ఈరకంగానే స‌మ‌యం దాట‌డం వ‌ల్ల..ఈ సంగీత క‌చేరి నిలిపివేయాల‌ని రెహ్మాన్‌తో పాటు ఆయ‌న బృందాన్ని కోరిన‌ట్లు పోలీసులు చెప్పారు. రాజా బ‌హ‌దూర్ మిల్లులో జరిగిన ఆ లైవ్ షోకు భారీ సంఖ్య‌లో రెహ్మాన్ అభిమానులు పాల్గోన్నారు.

అయితే పోలీసులు మాట్లాడుతూ.. త‌మ అభ్య‌ర్థ‌న‌కు రెహమాన్ పాజిటివ్‌గా రియాక్డ్ అయ్యారని.. తమ మాటలను గౌరవించి.. విధులకు ఎటువంటి ఆటంకం కలగకుండా.. వెంటనే షోను ఆపేసిన‌ట్లు బుంద్‌గార్డెన్ పోలీసు ఇన్‌స్పెక్ట‌ర్ సంతోష్ పాటిల్ వెల్లడించారు. దాంతో షోపై ఎటువంటి కేసు నమోదు చేయలేదని వారు వెల్లడించారు.

Updated On 1 May 2023 7:51 AM GMT
Ehatv

Ehatv

Next Story