హీరో గోపీచంద్‌తో కలిసి రామబాణంలో నటించిన డింపుల్‌ హయాతి గుర్తున్నారా? ఆ హీరోయిన్‌పై క్రిమినల్‌ కేసు నమోదయ్యింది. ఐపీఎస్‌ అధికారి కారును ఉద్దేశపూర్వకంగా ఢీ కొట్టడంతో పాటు హంగామా చేసిందన్న ఆరోపణలతో ఆమెపై జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. జూబ్లీహిల్స్‌ జర్నలిస్ట్‌ కాలనీ హుడా ఎన్‌క్లేవ్‌లో ఉన్న ఎస్‌కేఆర్‌ ఎన్‌క్లేవ్‌ అపార్ట్‌మెంట్స్‌లో ఐపీఎస్‌ అధికారి నివాసముంటున్నారు. అదే అపార్ట్‌మెంట్‌లో టాలీవుడ్‌ హీరోయిన్‌ డింపుల్‌ హయతీ ఉంటున్నారు. తన ఫ్రెండ్‌ విక్టర్‌ డేవిడ్‌తో కలిసి ఆమె ఉంటున్నారట. ఐపీఎస్‌ అధికారి కారు పార్క్‌ చేసే స్థలంలో డింపుల్‌, ఆమె స్నేహితుడు విక్టర్‌ డేవిడ్‌లు తమ బీఎండబ్ల్యూ కారును పార్క్‌ చేశారు. ఇలా చేయడమే కాకుండా గొడవకు దిగుతూ వీరంగం వేస్తున్నారు.

హీరో గోపీచంద్‌తో కలిసి రామబాణంలో నటించిన డింపుల్‌ హయాతి గుర్తున్నారా? ఆ హీరోయిన్‌పై క్రిమినల్‌ కేసు నమోదయ్యింది. ఐపీఎస్‌ అధికారి కారును ఉద్దేశపూర్వకంగా ఢీ కొట్టడంతో పాటు హంగామా చేసిందన్న ఆరోపణలతో ఆమెపై జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. జూబ్లీహిల్స్‌ జర్నలిస్ట్‌ కాలనీ హుడా ఎన్‌క్లేవ్‌లో ఉన్న ఎస్‌కేఆర్‌ ఎన్‌క్లేవ్‌ అపార్ట్‌మెంట్స్‌లో ఐపీఎస్‌ అధికారి నివాసముంటున్నారు. అదే అపార్ట్‌మెంట్‌లో టాలీవుడ్‌ హీరోయిన్‌ డింపుల్‌ హయతీ ఉంటున్నారు. తన ఫ్రెండ్‌ విక్టర్‌ డేవిడ్‌తో కలిసి ఆమె ఉంటున్నారట. ఐపీఎస్‌ అధికారి కారు పార్క్‌ చేసే స్థలంలో డింపుల్‌, ఆమె స్నేహితుడు విక్టర్‌ డేవిడ్‌లు తమ బీఎండబ్ల్యూ కారును పార్క్‌ చేశారు. ఇలా చేయడమే కాకుండా గొడవకు దిగుతూ వీరంగం వేస్తున్నారు. డీసీపీ వెహికిల్‌కు ఉన్న కవర్‌ను తీసేయడం, వెహికల్‌కు అడ్డుగా పెట్టిన కోన్‌లను కాలితో తన్నడం వంటి చేష్టలు కూడా చేశారు. ఇక్కడితో ఆగకుండా ఈ నెల 14న డింపుల్‌ హయాతి తన వాహనంతో డీసీపీ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో పార్క్‌ చేసి ఉన్న ఐపీఎస్‌ కారు ముందుభాగం పూర్తిగా దెబ్బతింది. ఉద్దేశపూర్వకంగా ఢీ కొట్టడమే కాకుండా కారును కాలితో తన్నుతూ వీరంగం వేసింది. ప్రశ్నించిన డ్రైవర్‌తోనూ కొట్లాట పెట్టుకుంది. ఇక భరించలేక డింపుల్‌ హయాతి, ఆమె స్నేహితుడు విక్టర్‌ డేవిడ్‌పై పోలీసులకు కంప్లయింట్‌ చేశారు. వారిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated On 23 May 2023 4:10 AM GMT
Ehatv

Ehatv

Next Story