సుందరా ట్రావెల్స్ సినిమా(Sundhara Travels Movie) హీరోయిన్ రాధ(Actress Radha) వివాదంలో చిక్కుకున్నారు. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి(Real Estate Businessman) ని ఆమె చితకబాదారు. దెబ్బలు తిన్న అతగాడు పోలీసులకు కంప్లయింట్ చేయడంతో వారు ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్నారు.

Actress Radha
సుందరా ట్రావెల్స్ సినిమా(Sundhara Travels Movie) హీరోయిన్ రాధ(Actress Radha) వివాదంలో చిక్కుకున్నారు. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి(Real Estate Businessman) ని ఆమె చితకబాదారు. దెబ్బలు తిన్న అతగాడు పోలీసులకు కంప్లయింట్ చేయడంతో వారు ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్నారు. వివరాల్లోకి వెళితే చెన్నై(Chennai)లోని నెర్కుండ్రం పల్లవ్‌నగర్ సమీపంలో ఉన్న ఎరిక్కరై వీధిలో 48 ఏళ్ల మురళీకృష్ణన్ ఉంటున్నాడు. అతడు రియల్ ఎస్టేట్ వ్యాపారి. పైగా ఎల్‌ఐసీ ఏజెంట్ కూడా! సినీ నటి రాధను అతడు తన స్నేహితుడు ద్వారకేశ్‌కు పరిచయం చేశాడు. రెండేళ్ల కిందట ద్వారకేశ్ దగ్గర సినీ నటి రాధ 90 వేల బిట్ కాయిన్స్‌ను పెట్టుబడిగా పెట్టారు. ఆ తర్వాత ఆ బిట్ కాయిన్స్‌ను రాధకు తిరిగి చెల్లించలేదు. దీంతో ద్వారకేశ్‌ను పరిచయం చేసిన మురళీకృష్ణన్‌ను బిట్ కాయిన్స్ చెల్లించాల్సిందిగా ఒత్తిడి తీసుకొచ్చింది రాధ. ఓ రోజు రాధ, ఆమె తల్లి పల్లవి, కొడుకుతో పాటు మరో ముగ్గురు చూలైమేడులోని తన కార్యాలయానికి వచ్చి గొడవ చేశారని చెప్పాడు మురళీకృష్ణన్. తనను రాధ కింద పడేసి కొట్టిందన్నాడు. తీవ్ర గాయాలైన తనను తన అనుచరులు స్థానిక రాయపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారని, తలకు మూడు కుట్లు పడ్డాయని తెలిపాడు మురళీకృష్ణన్. స్థానిక పడపళని పోలీస్‌స్టేషన్‌లో మురళీకృష్ణన్ ఫిర్యాదు చేశాడు.
