సినీ నటి స్వాతి దీక్షిత్(Swathi Deekshith)పాటు మరికొందరిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. దౌర్జన్యానికి దిగినందుకు ఆమెపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. విషయమేమిటంటే... జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 58లో ఉన్న ప్లాట్ నంబర్ 1141 ఓనర్ మాధురి విదేశాల్లో ఉంటున్నారు. ఆ ఇంటి అమ్మకానికి సంబంధించి స్వాతి దీక్షిత్‌తో పాటు ఆమె స్నేహితులు మధ్యవర్తులుగా వ్యవహరించారు.
సినీ నటి స్వాతి దీక్షిత్(Swathi Deekshith)పాటు మరికొందరిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. దౌర్జన్యానికి దిగినందుకు ఆమెపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. విషయమేమిటంటే... జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 58లో ఉన్న ప్లాట్ నంబర్ 1141 ఓనర్ మాధురి విదేశాల్లో ఉంటున్నారు. ఆ ఇంటి అమ్మకానికి సంబంధించి స్వాతి దీక్షిత్‌తో పాటు ఆమె స్నేహితులు మధ్యవర్తులుగా వ్యవహరించారు. అయితే ఇరు వర్గాల మధ్య డబ్బుల విషయంలో విభేదాలు వచ్చాయి. ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది. సోమవారం మధ్యాహ్నం కారుతో ఇంటి ముందు గేటును ధ్వంసం చేసిన స్వాతి దీక్షిత్‌తో పాటు మరో 20 మంది బలవంతంగా ఇంటిలోకి చొరబడ్డారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ ఫ్యామిలీ సభ్యులు శోభ, ఆమె భర్తను ఇష్టం వచ్చినట్టుగా తిట్టారు. వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్లాలని, లేకపోతే చంపేస్తామంటూ బెదిరించారు. ఈ మేరకు శోభ పోలీసులకు కంప్లయింట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్వాతి దీక్షిత్, చింతల సాయి ప్రశాంత్, రణవీర్ సింగ్, రామ్‌కుమార్‌లతో పాటు మరి కొందరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.